అప్పుడు ‘హలో’-ఇప్పుడు ‘ఛలో’

Sun Jan 14 2018 17:49:21 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవిని ఒక్క విషయంలో మాత్రం ఒప్పుకుని తీరాలి. తనకు వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా సినిమా షూటింగ్ సన్నాహాలు ఉన్నా ఎవరైనా తమ సినిమా ఫంక్షన్ కు రమ్మని పిలవడం ఆలస్యం వాళ్ళ అభిమానాన్ని కాదనలేక వెంటనే ఓకే చెప్పేస్తారు. ఒకవేళ ఏదైనా టీజర్ - ఫస్ట్ లుక్ లాంటిది తన చేతుల మీద జరగాలి అని అనుకుంటే ఇంటిదగ్గరికే పిలిచి మీడియాను కూడా రమ్మని చెబుతారు. ఇటీవలే జరిగిన జువ్వ అనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ వరకు ఇది జరుగుతూనే ఉంది. తాజాగా మరో పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. నాగ శౌర్య హీరోగా రష్మిక మండన్న హీరొయిన్ గా నటించిన ఛలో మూవీ ఆడియో ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనుంది. దీనికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడానికి ఓకే చెప్పారు.ఛలో నిజానికి డిసెంబర్ చివరి వారంలోనే విడుదల కావాల్సింది. కాని అప్పుడు హలో ఒక్క క్షణం బరిలో ఉండటంతో ఛలోకి ఛాన్స్ దక్కలేదు. దాంతో హడావిడిగా చేద్దాం అనుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకుని ప్రమోషన్ మీద దృష్టి పెట్టారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంగీతం మహతి. మెలోడీ బ్రహ్మగా పేరొంది అగ్ర హీరోల సినిమాకు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ వారసుడు ఇతను. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా చూడచక్కంగానే అనే సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. చాలా రోజుల నుంచి కమర్షియల్ సక్సెస్ కోసం తహతహలాడుతున్న నాగ శౌర్య దీంతో హిట్ కొడతాను అనే నమ్మకంతో ఉన్నాడు.

ఫిబ్రవరి 2 న విడుదల తేది ఫిక్స్ చేసిన ఛలో కి ప్రస్తుతానికి పోటీ భయం లేదు కాని ఆ టైంలో అమాంతం ఏవైనా ముంచుకొచ్సినా ఆశ్చర్యం లేదు. దానికి ముందు వారం భాగమతి ఆచారి అమెరికా యాత్ర అభిమన్యుడు ఉండగా తరువాతి వారం గాయత్రి కిర్రాక్ పార్టీ లాంటి మూవీస్ పోటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిరు గెస్ట్ కాబట్టి ఛలోకి హైప్ తోడవుతుంది. హలోకు అతిధిగా వచ్చిన చిరునే ఛలోకు కూడా రావడం విశేషమే.