Begin typing your search above and press return to search.

చిరు అక్కడ ‘బ్రూస్ లీ’ మాట ఎత్తుతాడా?

By:  Tupaki Desk   |   29 March 2017 9:27 AM GMT
చిరు అక్కడ ‘బ్రూస్ లీ’ మాట ఎత్తుతాడా?
X
ఆగడు.. బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ల తర్వాత శ్రీను వైట్ల రూపొందించిన సినిమా ‘మిస్టర్’. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇందులో కథానాయకుడిగా నటించాడు. తన తమ్ముడి కొడుకంటే చిరుకు చాలా ఇష్టం. అతడి కోసం ‘మిస్టర్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు చిరు. ఈ గురువారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆడియో వేడుక జరగబోతోంది. చిరు ముఖ్య అతిథి కావడంతో ఈ వేడుకకు మీడియాలో మంచి ప్రయారిటీ దక్కుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఆశించిన బజ్ రాలేదు. ఐతే చిరు అతిథిగా ఆడియో వేడుక చేస్తుండటంతో హైప్ దానంతట అదే వస్తుందని భావిస్తున్నారు.

ఈ వేడుకలో చిరు ‘మిస్టర్’ గురించి.. వరుణ్ గురించి ఏం మాట్లాడతాడు అన్నదాని కంటే దర్శకుడు శ్రీను వైట్ల గురించి ఏం మాట్లాడతాడనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆగడు’ అట్టర్ ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా చరణ్ ను వైట్లకు అప్పగిస్తే.. ‘బ్రూస్ లీ’ లాంటి డిజాస్టర్ అందించాడు. అందులో చిరు చేసిన క్యామియో కూడా వేస్ట్ అయింది. ఈ ఫలితం చూసి చిరు అప్పట్లో చాలా అప్సెట్ అయ్యాడంటారు. ఈ నేపథ్యంలో చిరు వైట్ల ప్రస్తావన వచ్చినపుడు ఏం మాట్లాడతాడన్నది ఆసక్తికరం. అసలాయన ‘బ్రూస్ లీ’ ప్రస్తావన తెస్తాడా.. తెచ్చినట్లయితే దాని రిజల్ట్ గురించి ఏమంటాడో చూడాలి. దాని గురించి ఓపెన్ గా మాట్లాడతాడా.. లేక ఆ విషయం దాటవేస్తాడా.. చూద్దాం మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/