Begin typing your search above and press return to search.

చిరంజీవి కోసం దాసరి ఆర్టికల్

By:  Tupaki Desk   |   22 Jan 2017 6:32 AM GMT
చిరంజీవి కోసం దాసరి ఆర్టికల్
X
కొన్నాళ్ల కిందటి వరకు చిరంజీవి మాటెత్తితే వెటకారంగా స్పందించేవారు దాసరి నారాయణరావు. చిరంజీవి మీద సెటైర్ వేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేవారు కాదాయన. ఐతే ఈ మధ్య ఆయన తీరు మారింది. చిరంజీవిని బాగా పొగిడేస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై.. అక్కడా చిరు మీద ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆయన చిరంజీవి మీద స్పెషల్ ఆర్టికల్ కూడా రాశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘చిరంజీవితం 150’లో దాసరి రాసిన స్పెషల్ ఆర్టికల్ ఉండటం విశేషం. చిరంజీవి మీద పుస్తకం రాస్తున్నట్లు చెప్పగానే దాసరి తన మీద ఓ ఆర్టికల్ రాసి పంపారట. దీన్ని ఆ పుస్తకంలో పొందుపరిచారు.

మరోవైపు ఈ పుస్తకంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్ స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. పుస్తకంలో ఈ రెండు ఇంటర్వ్యూలు.. దాసరి ఆర్టికలే హైలైట్లు అంటున్నాడు రచయిత పుసుపులేటి రామారావు. కేవలం 25 రోజుల్లోనే ఈ పుస్తకాన్ని ఆయన పూర్తి చేశారట. ఈ పుస్తకం గురించి చరణ్ స్పందిస్తూ.. ‘‘నాన్న గారి గురించి ప‌సుపులేటి రామారావు లాంటి సీనియర్ జర్నలిస్టు పుస్త‌కం రాయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్త‌కంలో ఫోటోలు చాలా బాగున్నాయి. నేను కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని ఫోటోలు ఈ పుస్త‌కంలో ఉన్నాయి. నా గురించి నాకు తెలియని విషయాలు కూడా పొందు పరిచారు. మా లైబ్రెరీలో ఇది నెంబర్ వన్ పుస్తకం అవుతుంది. అభిమానులందరూ ఈ పుస్తకాన్ని కొనండి’’ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/