Begin typing your search above and press return to search.

'అందరివాడు' అనిపించేసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   3 May 2018 5:24 AM GMT
అందరివాడు అనిపించేసుకుంటున్నాడు
X
మెగా స్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో ఈ పేరొక బ్రాండ్ ఇమేజ్. సినిమాలకు సంబంధించినంత వరకు చిరంజీవి లైఫ్ ఒక టెక్ట్స్ బుక్ లాంటిది. కేవలం నటనలోనే కాదు... స్వయంకృషితో పైకెదిగిన నటుడిగా జూనియర్లకు సపోర్ట్ ఇవ్వడంలోనూ చిరంజీవి తరవాతే ఇంకెవరయినా. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల ఫంక్షన్ల వరకు అటెండవుతూ అందరిలోనూ జోష్ నింపుతున్నారు.

మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు. వీలైనంతవరకు అందరి సినిమాలు చూసి మంచి చెడులు విశ్లేషిస్తూనే ఉంటారు. దీంతోపాటు అప్ కమింగ్ హీరోలకు ఎందరో సినిమాలు లాంచ్ చేయడంతో పాటు వాళ్లకు అండగా నిలిచారు. ఈమధ్య యంగ్ హీరో నాగశౌర్య నిర్మాతగా మారి సొంతంగా ఛలో సినిమా తీసినప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కు అటెండయ్యారు. తాజాగా సుధీర్ బాబు సమ్మోహనం సినిమా టీజర్ రిలీజ్ చేసి అతడిని ప్రశంసించారు. విజయ్ ఆంటోని సినిమా ఇంద్రసేన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసింది చిరుయే. దిక్కులు చూడకు రామయ్య ఫేం త్రికోటి డైరెక్షన్ లో వచ్చిన లో బడ్జెట్ మూవీ జువ్వ సినిమా టీజర్... కొత్త హీరో ఆకాశ్ నటిస్తున్న శరభ మూవీ ఫస్ట్ లుక్ చిరుయే లాంచ్ చేశారు. ఇలా ఈమధ్య కాలంలో చాలా ఈవెంట్లలో చిరు కనిపించారు.

అక్కినేని వారి వారసుడు అఖిల్ రీ లాంచ్ సినిమా హలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా చిరు హాజరయ్యారు. భేషజాలు లేకుండా ఇండస్ట్రీలో అందరినీ కలుపుకోవడమే చిరుకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ లో తయారయ్యే సినిమాల ఈవెంట్లకు చిరు రావడమే ఓ ప్రమోషన్ గా మారుతోంది. తనను ఇన్వైట్ చేసిన ప్రతి ఈవెంట్ కు దాదాపుగా అటెండవుతూ అందరివాడు అనే టైటిల్ కు ఈనాటికీ నిలబెట్టుకుంటున్నాడు మెగాస్టార్.