Begin typing your search above and press return to search.

దర్శకుడికి చిరు ఏం చెప్తున్నారో?

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:03 AM GMT
దర్శకుడికి చిరు ఏం చెప్తున్నారో?
X
మెగాస్టార్ చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా'. మరో పదిహేను రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది కానీ ప్రమోషన్స్ మాత్రం నెమ్మదిగానే సాగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ ఊపందుకుంటాయని.. రిలీజ్ అయిన మొదటి వారం వరకూ ప్రమోషన్స హంగామా కొనసాగుతుందని సమాచారం.

అయితే అంతలోపు ఒకటిఆరా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మురిపిస్తోంది 'సైరా' టీమ్. రీసెంట్ గా అలానే ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో ఉన్న చిరు దర్శకుడు సురేందర్ తో ముచ్చటిస్తూ ఉన్నారు. చిరు ఠీవిగా ఒక చిరునవ్వుతో ఏదో చెప్తూ ఉంటే సూరి చేతులు కట్టుకుని మరీ ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సురేందర్ రెడ్డి పై చిరు కోప్పడ్డారని కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవన్నీ పుకార్లేనని సురేందర్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే మరో సారి చిరు - సురేందర్ రెడ్డి రిలేషన్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పడానికి అన్నట్టుగా ఉంది. ఏదేమైనా పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఈ పోస్టర్ లో ట్రైలర్ మరో నాలుగు రోజుల్లో విడుదల అని వెల్లడించారు.

తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నయనతార.. తమన్నా.. విజయ్ సేతుపతి.. సుదీప్.. అమితాబ్ బచ్చన్.. అనుష్క ఈ సినిమా లో కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.