Begin typing your search above and press return to search.

మహేష్‌.. చిరు.. డిజప్పాయింట్ చేశారు

By:  Tupaki Desk   |   24 Aug 2016 11:30 AM GMT
మహేష్‌.. చిరు.. డిజప్పాయింట్ చేశారు
X
నిజానికి ఒక వైపు చూస్తే టాప్ స్టార్లతో ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ ఖుషీగానే ఉంటారు. కాని మరోవైపు చూస్తే మాత్రం.. కాస్త ఫీలవుతారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అండ్ మహేష్‌ బాబు విషయంలో ఇదే విధంగా ఫ్యాన్స్ ఫీలయ్యారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఈ స్టార్లిద్దరూ ఏం చేశారట.. పదండి చూద్దాం.

ఊళ్ళో లేకపోవడం వలన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు శిల్పాకళావేదికలో ఎరేంజ్ చేసిన కేక్ కటింగ్ ఈవెంటుకు రాలేకపోతున్నారని స్వయంగా రామ్ చరణ్‌ చెప్పాడు. అయితే ప్రతీ సంవత్సరం అభిమానుల చిరంజీవి చేతులతోనే కేక కట్ చేయిస్తున్నారు కాబట్టి.. ఈసారి ఆ అవకాశం తమకు ఇవ్వాలని కూడా చరణ్‌ కోరాడు. కట్ చేస్తే.. చిరంజీవి అదే రోజు రాత్రి పార్క్ హయాత్ లో పార్టీకి విచ్చేశారు. ఊళ్ళో లేకపోతే రాత్రి 10 గంటలకు పార్టీకి విచ్చేస్తారా? కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే విషయంలో కాస్త ఫీలయ్యారట.

ఇక మహేష్‌ బాబు విషయానికొస్తే.. మనోడు ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో ఏదో కొత్త లుక్ తో కనపించబోతున్నాడని మొదటి నుండీ టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా కోసం గెడ్డం పెంచుతున్నాడని.. క్లీన్ షేవ్ అని.. హెయిర్ స్టయిల్ మారిందని.. చాలానే విన్నాం. కాని చిరంజీవి బర్త్ డే పార్టీకి వచ్చిన.. ఎప్పుడూ కనిపించే సింపుల్ రొటీన్ లుక్ లోనే దర్శనమిచ్చాడు. గెడ్డం పెంచడం, కొత్తగా బాడీ పెంచడం.. అలాంటివేం లేదు. ఇదంతా కొత్తదనం కోరుకునే అభిమానులను కొందరిని డిజప్పాయింట్ చేసింది.