Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్ : చిరు.. సరిలేరు నీకెవ్వరూ..

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:47 AM GMT
బర్త్ డే స్పెషల్ : చిరు.. సరిలేరు నీకెవ్వరూ..
X
తెలుగు సినిమా ప్రేక్షకులకు క్రేజ్ కి అర్ధం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి నేటితో 61వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఒకసాధారణ కుటుంబంలోనుండి వచ్చి సినీ రంగంలో అసాధారణ ఎత్తుకి ఎదిగిన ఆయన జీవన చరిత్ర ఎందరికో స్పూర్తిదాయకం. అమితాబ్ - రాజ్ కపూర్ - రజినీకాంత్ - ఇక్కడ అప్పటికే తలనెరిసిన బడా హీరోల ఎరాలో అత్యధిక రెమ్యునరేషన్ వసూలు చేసి రికార్డు సృష్టించాడు.

ప్రతీ అభిమానీ ప్రేమగా అన్నయ్యా అని పిలుచుకుంటారు. ఆయన తెరమీద కన్నీళ్ళు కారిస్తే ఇక్కడ మనకు ఏడుపొస్తుంది. అక్కడ ఆయన తెరమీద కాలు కదిపితే ఇక్కడ మనకు ఊపొస్తుంది. క్రమక్రమంగా విస్తరిస్తూ అపర త్రివిక్రముడిగా టాలీవుడ్ ని రెండు దశాబ్దాల పాటూ ఏలిన ఘనుడు.

ఇప్పటితరం మెగా టాప్ హీరోలు చిరంజీవి పొందుపరిచిన బాటనే ఫాలో అవుతున్నారు. సునీల్ - రవితేజ వంటి హీరోలు ఆయన్ని స్పూర్తిగా తీసుకునే ఇండస్ట్రీకి వచ్చేశారు. ఎంటర్టైన్మెంట్ ట్రీట్మెంట్ నే కాక స్వయం కృషి - రుద్రవీణ వంటి క్లాసిక్స్ ని అందించారు. సినిమాలేకాక సామాజిక సేవలో సైతం ముందుండి రక్తదానం - నేత్ర దానాలకు స్పూర్తి ప్రదాతగా నిలిచారు. ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం "ఖైదీ నెం150" సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు.

చిరు చిత్రాలను ఒక చోట చేరుస్తూ... చిరంజీవి ఖ్యాతిని కీర్తిస్తూ..

ఆయన స్వయంకృషితో వేసిన పునాదిరాళ్ళు ఆయన్ని బిగ్ బాస్ గా నిలిపాయి. అభిమానుల ప్రేమను పొందాలన్న అభిలాషతో టాలీవుడ్ కిఛాలెంజ్ చేసి మగమహారాజులా ఈ రుస్తుం కొదమ సింహం మాదిరి గర్జనతో శత్రువుల గుండెల్లో రుద్రవీణ మ్రోగించారు. యువకులకు గ్యాంగ్ లీడర్ గా - కూలీలకు ముఠా మేస్త్రీగా - అత్తకు యముడిగా - అమ్మాయికి ఘరానా మొగుడిగా అక్కరకు వచ్చిన వారికి ఆపద్భాందవుడిగా - తల్లులకు చంటబ్బాయ్ అవుతూ, పిల్లలకు డాడీగా మారుతూ, తమ్ముళ్ళకు అన్నయ్యగా నిలుస్తూ దాదాలకే దాదాగా మారిన మా శంకర్ దాదా ఇలానే అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఖైదీగా బంధీ కావాలని కలకాలం అందరివాడుగా నిలవాలని ఆ
శ్రీ మంజునాధున్ని కోరుకుంటూ తుపాకీ.కామ్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.