Begin typing your search above and press return to search.

చిరు అభిమానులకు పండగే..

By:  Tupaki Desk   |   21 Jan 2017 6:45 AM GMT
చిరు అభిమానులకు పండగే..
X
తన రీఎంట్రీ మూవీ విషయంలో రెండు మూడేళ్ల పాటు నాన్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఐతే ఆ సినిమా విడుదలయ్యాక మాత్రం చిరు మాంచి స్పీడు అందుకునేలా ఉన్నాడు. ఈ ఏడాదే మెగాస్టార్ రెండు సినిమాలు మొదలుపెట్టబోతుండటం విశేషం. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చిరు కన్ఫమ్ చేశాడు. చిరు తర్వాతి సినిమా మార్చిలోనే మొదలుకాబోతోంది. ‘ధృవ’తో రామ్ చరణ్ కు మరిచిపోలేని హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తేలిపోయింది. ‘ధృవ’ పని ముగియగానే సురేందర్.. చిరు సినిమా స్క్రిప్టు పనిలో పడిపోయాడు. ‘కిక్-2’ వరకు వక్కంతం వంశీతో కలిసి పని చేసిన సురేందర్.. ప్రస్తుతం వేరే యువ రచయితలతో కలిసి చిరు కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ నిర్మాత రామ్ చరణే ఈ చిత్రాన్ని కూడా ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బేనర్ మీద ప్రొడ్యూస్ చేయనున్నాడు.

సురేందర్ సినిమా ముగింపు దశకు వచ్చేసరికి చిరు 152వ సినిమా మొదలవుతుందట. బోయపాటి శ్రీను ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. అల్లు అరవింద్ నిర్మిస్తాడు. బోయపాటి ఒక సినిమా పూర్తి చేశాక నాలుగు నెలల పాటు స్క్రిప్టు పనిలో ఉంటాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను తెరకెక్కిస్తున్న బోయపాటి.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఖాళీ అవుతాడు. తర్వాత చిరు కోసం స్క్రిప్టు రెడీ చేసి.. దసరా సమయానికి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ ఏడాది ఆల్రెడీ ఒక సినిమాతో పలకరించిన చిరు.. ఇంకో రెండు సినిమాల్ని మొదలుపెట్టడమే కాక.. వాటిలో ఒకదాన్ని ఏడాది ఆఖర్లో రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/