Begin typing your search above and press return to search.

జూన్ 6 నుండి మెగా రచ్చ షురూ..

By:  Tupaki Desk   |   24 May 2016 4:21 AM GMT
జూన్ 6 నుండి మెగా రచ్చ షురూ..
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ 150వ సినిమా లాంచనంగా ప్రారంభమైనా మొదటి షెడ్యూల్ వివరాలు ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

వచ్చే నెల 6వ తెదినుండి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్టు సమాచారం. తన రీ ఎంట్రీకి ఇప్పుడు చిరు ఫిట్ గా వున్నట్టు ఆయన విశ్వాసం. అంతేకాక ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా కనిపించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అనుకున్న వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర బృందం భావిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ తో చిరు ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కత్తికి రీమేక్ గా తెరకెక్కనుంది.