Begin typing your search above and press return to search.

చిరు 150లో రాజమౌళి కొడుకు కూడా..

By:  Tupaki Desk   |   22 Aug 2016 9:30 AM GMT
చిరు 150లో రాజమౌళి కొడుకు కూడా..
X
అబ్బే కంగారుపడకండి.. ఆ సినిమాలో మనోడు ఏమీ నటించట్లేదు. కాకపోతే ఇప్పుడు సినిమాకు సంబంధించి టీజర్స్ విషయంలో రాజమౌళి కొడుకు కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పదండి ఓసారి చూద్దాం.

రాత్రి 12 గంటలకు షార్పుగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే టీజర్ ఒకటి రిలీజ్ చేశాడు రామ్ చరణ్‌. తాను స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మెగాస్టార్ కు విషెస్ తెలిపాడు. అయితే ఈ టీజర్ ను తయారుచేసింది ఎవరో కాదు.. రాజమౌళి కొడుకే. మనోడు షోయింగ్ బిజినెస్ పేరుతో ఎప్పటినుండో ఒక కంపెనీ నడుపుతన్నాడు. బాహుబలి మేకింగ్ వీడియోస్.. అఖిల్ ఆడియో టీజర్స్.. ఇలా చాలా టీజర్లను బాగా క్రియేటివ్ గా రూపొందించి ఇరగదీశాడు. ఇప్పుడు 150వ సినిమాకు ముందు వచ్చిన బర్త్ డే టీజర్ ను కూడా బాగానే చేశాడులే.

''అసలు ఖైదీ నెం 150 సినిమా టీజర్లపై వర్కు చేస్తున్నందుకు చాలా లక్కీగా ఫీలవుతున్నాను. హ్యాపీ బర్త్ డే చిరంజీవి సార్'' అంటూ కార్తికేయ కూడా ఆనందంతో వెలిగిపోతున్నాడనుకోండి. మొత్తానికి చిరు 150లో అలా రాజమౌళి కొడుకు హ్యాండ్ పడిందనమాట.