Begin typing your search above and press return to search.

16వ తేదీన 150 మూవీ ప్ర‌క‌ట‌న‌?

By:  Tupaki Desk   |   9 Oct 2015 7:30 AM GMT
16వ తేదీన 150 మూవీ ప్ర‌క‌ట‌న‌?
X
మెగాభిమానుల‌కు ఇది సిస‌లైన శుభ‌వార్త‌. ఇంత‌కాలం ఎంతో ఎగ్జ‌యిట్‌ మెంట్‌ తో ఎదురు చూసిన ఆ శుభ‌ఘ‌డియ రానే వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌కు సంబ‌ధించిన డీటెయిల్స్ రావ‌డానికి టైమ్ వ‌చ్చేసింది. కౌంట్ డౌన్ మొద‌లైంది. అభిమానుల ముందుకు చిరు ఆ శుభ‌వార్త చెప్పేందుకు వ‌చ్చేస్తున్నారు. ఇక స‌స్పెన్స్‌ కి తెర దించేస్తున్నారు.

గ‌త రెండేళ్లుగా... మెగాభిమానుల్లో ఒక‌టే టెన్ష‌న్‌. వెర్రెత్తిపోయి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని వివ‌రాల్ని చిరు అధికారికంగా ప్ర‌క‌టించే రోజు కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అప్ప‌ట్లో బ్రూస్‌ లీ ఆడియోలో చిరంజీవి మాట్లాడుతూ మ‌రో 15రోజుల్లో అధికారికంగా వివ‌రాల్ని వెల్ల‌డిస్తాం అని అన్నారు. అయితే ఎప్ప‌టిలాగే దాట‌వేసేందుకే ఇలా చెబుతున్నార‌ని ఫ్యాన్స్‌ తో పాటు అంతా అనుకున్నారు. కానీ మెగాస్టార్ ఆ రోజు ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటున్నార‌ని స‌మ‌చారం. ఇక 150వ సినిమా అధికారిక వివ‌రం వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ప్రారంభో్త్స‌వం - పూజ‌ - ఠెంకాయ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వివ‌రాల్ని ఈనెల 16న‌ వెల్ల‌డించ‌నున్నార‌ని టాక్‌..

మెగాస్టార్ చిరంజీవి - 150వ సినిమా నిర్మాత‌లు రామ్‌ చ‌ర‌ణ్‌ - సురేఖ చిరంజీవి అధికారికంగా మీడియా ముందుకు వ‌చ్చి వివ‌రాల్ని వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం. అందుకు ప్ర‌త్యేకించి ఓ మీడియా మీట్‌ ని కూడా ఏర్పాటు చేస్తున్నార‌ని విష‌యం లీకైంది. ఇది అభిమానుల‌కే కాదు తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ ఓ షాకింగ్ అండ్ ఎగ్జ‌యిటింగ్ న్యూస్. అయితే బ్రూస్‌ లీ సక్సెస్‌ మీట్‌ అని చెప్పి.. అందులో ఈ ప్రకటన చేస్తారు కాబోలు.. ఎందుకంటే సేమ్‌ డే చెర్రీ బ్రూస్‌ లీ రిలీజ్‌ అవుతోంది మరి.