ఆ సింగర్ సీరియస్ అయ్యారు

Fri Aug 10 2018 23:23:19 GMT+0530 (IST)

సెలబ్రిటీటీలు అంతా ఒకలా ఉండరు. సినిమావాళ్లే కాబట్టి ఏం మాట్లాడినా సినిమాటిక్ గా తీసుకొంటారనుకుంటే పప్పులే కాలేసినట్టే.  గాసిప్ లకి పెట్టింది పేరైన సినిమా ఇండస్ట్రీలో  కొద్దిమంది వాటిని లైట్ గా తీసుకుంటుంటారు. మరికొద్దిమంది మాత్రం చిన్న పుకారొచ్చినా చాలా సెన్సిటివ్ గా   ఫీలైపోతుంటారు. దాని గురించి పదే పదే ఆవేదన చెందుతుంటారు. అందుకే ఎవరెలాంటివాళ్లో తెలుసుకొని మాట్లాడాలి. ఇదంతా ఇప్పుడెందుకంటే.. తాజాగా ఓ సెలెబ్రిటీ హర్టయ్యారు కాబట్టి! ఆ సెలెబ్రిటీ ఎవరో కాదు... `చిలసౌ`తో హిట్టు కొట్టిన యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి.మంచి సింగర్ గా నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన చిన్మయి ట్విట్టర్ లో అభిమానులతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఒకరు రాహుల్ రవీంద్రన్ ని ఎప్పుడైనా కొట్టారా? అని ప్రశ్నించాడు. దానికి ఫీలయిన చిన్మయి ``నాకు వేరే ఏం పని లేదు కాబట్టి అతన్ని రోజుకి ఒక్కసారయినా కొడుతాను. అసలేం ఏం ప్రశ్నండీ ఇది` అంటూ రిప్లై ఇచ్చారు. చిన్మయి మాటల్లో కూడా హింసని భరించలేని వ్యక్తి తెలుసా? అంటూ భర్త రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు.