Begin typing your search above and press return to search.

కొత్త వ్యాపారం మొదలుపెట్టిన చిన్మయి

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:16 AM GMT
కొత్త వ్యాపారం మొదలుపెట్టిన చిన్మయి
X
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నయా బిజినెస్‌ లోకి ప్రవేశించింది. హేకా స్టూడియోస్ పేరుతో ఆర్కిటెక్చర్ & ఇంటీరియయర్ డిజైన్ స్టూడియో సంస్థను ప్రారంభించింది. ఇంటీరియర్ డిజైనింగ్ లో వ్యాపారం ప్రారంభించడం చిన్మయికి డ్రీమ్. ఇప్పుడు దాన్ని సాధ్యం చేసుకుంది.

ఇద్దరు ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్‌ లను కలిసిందట గతంలో. ఆ ఇద్దరి ట్యాలెంట్‌ కు ముగ్ధురాలైన చిన్మయి.. వారితో స్నేహం చేయడమే కాక.. ఈ సెగ్మెంట్‌ లో వ్యాపారం స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. కొంతకాలం రీసెర్చ్ చేసి.. చివరకు హేకా స్టూడియోస్ అంటూ.. న్యూ బిజినెస్ మొదలుపెట్టేసింది. ఇంటీరియర్ డిజైనింగ్‌ తో అద్భుతాలు చేయచ్చని, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్‌ లను అందిస్తామంటోంది చిన్మయి.

ఈ ట్యాలెంటెడ్ సింగర్ గతంలో కూడా ఓ బిజినెస్ స్టార్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ట్రాన్స్‌లేషన్ సర్వీసులను నిర్వహించే ఆ కంపెనీ పేరు బ్లూ ఎలిఫెంట్. ఇప్పుడీ కంపెనీలో 3వేల మంది ట్రాన్స్‌ లేటర్లు, 150కిపైగా భాషలకు సంబంధించిన అనువాద సర్వీసులు నిర్వహిస్తుంటారు. ఇంత మందికి ఉపాధి కల్పించడమంటే మాటలా.. మనస్ఫూర్తిగా చిన్మయికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.