Begin typing your search above and press return to search.

ఆ మోడల్.. 4 రోజులుగా కనిపించట్లేదు

By:  Tupaki Desk   |   29 May 2017 10:50 AM GMT
ఆ మోడల్.. 4 రోజులుగా కనిపించట్లేదు
X
చెన్నైకి చెందిన మోడల్ ఒకరు నాలుగు రోజులుగా కనిపించకపోవడం చర్చనీయాంశమతోంది. ఆ మోడల్ పేరు.. గానమ్ నాయర్. 28 ఏళ్ల గానమ్ మోడల్ గానే కాక.. ఓ ప్రైవేటు టీవీ ఛానెల్లో స్క్రీన్ ప్లే రైటర్ గానూ పని చేస్తోంది. ఆమె మే 26 నుంచి కనిపించడం లేదు. ఇంటి నుంచి ఓ ఫ్రెండును కలవడానికి స్కూటీ మీద బయల్దేరిన ఆమె.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గానమ్ తండ్రి ఢిల్లీలో ఉంటాడు. గానమ్ సినీ రంగంలో ఫేమ్ సంపాదించాలని చెన్నైలో కొన్నేళ్ల కిందట ప్రయత్నాలు ఆరంభించింది.

కొన్ని ప్రకటనల్లో నటించిన గానమ్.. తర్వాత ఓ టీవీ ఛానెల్లో స్క్రీన్ రైటర్ గా చేరింది. ఈ నెల 26న ఉదయం విరుగంబాక్కంలో ఓ ఫ్రెండును కలిసి వస్తానంటూ విరుగంబాక్కం నుంచి నుంగబాక్కంకు బయల్దేరింది. స్కూటీలో వెళ్లిన ఆమె ఆ తర్వాత తిరిగి రాలేదని బంధువులు.. సన్నిహితులు చెబుతున్నారు. ఆమె స్కూటీ ఆచూకీ కూడా దొరకట్లేదు. గానమ్ బంధువు కేకే నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గానమ్ ఫోన్ నంబర్ కాల్స్ ఆధారంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గానమ్ అదృశ్యమైన నేపథ్యంలో ఆమె తండ్రి ఢిల్లీ నుంచి చెన్నై వచ్చాడు. పోలీసులు ఆమె స్నేహితుల్ని.. బంధువుల్ని విచారిస్తున్నారు. త్వరలోనే ఆమె ఆచూకీ కనుగొంటామని అంటున్నారు. గానమ్ కలుస్తానన్న ఫ్రెండు ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/