టైమ్స్ ముగ్ధల్లో టాప్ బ్యూటీస్

Mon Feb 18 2019 17:14:38 GMT+0530 (IST)

సౌత్ లో అత్యంత ప్రభావవంతమైన కథానాయికలు ఎవరు? అందచందాలు.. నడవడిక.. గుణగణాలు తెలివితేటలతో పాటు యువతరాన్ని అమితంగా ఆకట్టుకునే కథానాయికలు ఎందరు ఉన్నారు... అన్నదానిపై ప్రఖ్యాత చెన్నయ్ టైమ్స్ చేసిన పరిశోధనలో ఓ 30 మంది కథానాయికల పేర్లను వెలుగులోకి తెచ్చింది. ఈ  భామలంతా గొప్ప ప్రతిభావనులుగానూ సినీపరిశ్రమలో దూసుకుపోతున్నారు. అందం - అభినయం - ఆహార్యం - చిరునవ్వు.. ఇతరత్రా విభాగాల్లోనూ ఈ భామామణుల్లో దాగి ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకుని `ముగ్ధ మందారాల` జాబితాలో చేర్చారు.వీళ్లందరిలో నంబర్ -1 స్థానాన్ని దక్కించుకున్న తారక ఐశ్వర్యా రాజేష్. ఈ బ్యూటీ తెలుగువారికి అంతగా సుపరిచితం కాకపోయనా తమిళనాట మాత్రం వెలుగులు విరజిమ్ముతోంది. 2010లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ 2019లోనే అరడజను పైగా తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ధ్రువనక్షత్రం - ఇదు వేధాలం సొల్లు కథై - ఇదం పొరుల్ ఎవల్ - వడ చెన్నయ్ 2 చిత్రాల్లో నటిస్తోంది. కార్తీ- మాధవన్ ల చిత్రంలో - సుందరమ్ ప్రొడక్షన్స్ - గోపి నయనార్ - సుశీందరన్ చిత్రాల్లో నటిస్తోంది. జీవీ ప్రకాష్  మణిరత్నం  నిర్మిస్తున్న చిత్రంలోనూ ఆడిపాడుతోంది. ఆ తర్వాత రెండో స్థానాన్ని తలైవి నయనతార ఆక్రమించింది. నయన్ నటించిన పలు చిత్రాలు 2019లో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. కళ్లతోనే కోటి భావాలు పలికించే ఏకైక నాయికగా పాపులరైంది. అందుకే టైమ్స్ ఈ స్థానం కట్టబెట్టింది. ఆ తర్వాత మూడో స్థానంలో అక్కినేని కోడలు సమంత పేరు నిలిచింది. 2018లో సామ్ నటించిన యూటర్న్ ఇటు తెలుగు - అటు తమిళంలోనూ రిలీజైంది. తన నటనకు గొప్ప పేరొచ్చింది. సామ్ అందమైన నవ్వుకు లక్షలాది హృదయాలు జివ్వుమంటాయంటూ అరుదైన క్వాలిటీని టైమ్స్ ప్రకటించింది. 4- అనుకీర్తి వాస్ మిస్ వరల్డ్ ఇండియా -2018. ఐదో స్థానంలో కీర్తిసురేష్ నిలిచింది. మహానటి చిత్రంలో సావిత్రిగా అభినయించి తెలుగు - తమిళ ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి హోమ్ లీ గాళ్ గా పాపులరైంది.

యశిక ఆనంద్ - త్రిష - ఓవియ - అదితీరావ్ హైదరీ - సాయిపల్లవి - రకుల్ ప్రీత్ - ప్రియా భవానీ శంకర్ - సయేషా సైగల్ - కాజల్ - ఎమీజాక్సన్ - ఆండ్రియా జెరోమి - దివ్యదర్శిని - తమన్నా - రైజా విల్సన్ - అమలాపాల్ - రెజీన - రాశీఖన్నా - జనని అయ్యర్ - అనుష్క శెట్టి - ఆత్మిక - శ్రుతిహాసన్ - ఐశ్వర్యాదత్తా - బిందుమాధవి - డయాన ఎరప్ప - షెర్లిన్ సేథ్ పేర్లు వరుసగా జాబితాలో నిలిచాయి. వీళ్లలో త్రిష - అదితీరావ్ - సాయి పల్లవి - రకుల్ - రాశీఖన్నా - రెజీన వరుసగా సినిమాలు చేస్తూ బిజీ. అనుష్క - బిందుమాధవి సినిమాల పరంగా స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే.