సేతుపతి సినిమా ఫస్ట్ లుక్ భలే ఉందే!

Thu May 23 2019 16:50:20 GMT+0530 (IST)

కొలీవుడ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో నటించని విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి 'సైరా' చిత్రం ద్వారా త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాదు.. కొత్త మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాలో విలన్ పాత్ర కూడా పోషిస్తున్నాడు.ఇదిలా ఉంటే తమిళంలో విజయ్ సేతుపతికి లైన్లో చాలానే సినిమాలు ఉన్నాయి.  అందులో ఒకటి 'చెన్నై పళని మార్స్'. విజయ్ సేతుపతి సినిమా అనగానే ఆయన హీరోగా నటిస్తున్నాడని పుసుక్కున ఫిక్స్ అయిపోకండి. ఈ సినిమాకు విజయ్ సేతుపతి నిర్మాత. 'విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్' బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అంతే కాదు.. ఈ సినిమాకు కథ అందించింది కూడా విజయ్ సేతుపతే.  ఈ సినిమాకు దర్శకుడు బిజు విశ్వనాధ్.  ఇదో పల్లెటూరి నేపథ్యంలో సాగే అంతరిక్షం కనెక్షన్ ఉన్న స్పేస్ కామెడీ ఫిలిం అని సమాచారం.  

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.  టైటిల్ కు తగ్గట్టే ఈ ఫస్ట్ లుక్ కూడా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  ఫస్ట్ లుక్ పోస్టర్ లో అంతరిక్షంలో స్పేస్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి.. అయన వెనక మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.  నటుడిగా తన సత్తా చాటిన విజయ్ సేతుపతి రచయితగా ఎలాంటి కథతో తమిళ ఆడియన్స్ ను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.