Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆచారి విజువల్స్ సూపర్

By:  Tupaki Desk   |   16 Jan 2018 7:21 AM GMT
అమెరికాలో ఆచారి విజువల్స్ సూపర్
X
విదేశాలలో.. అక్కడి అందమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించడం కొత్తేమీ కాదు. ఇక్కడ కూడా అందమైన లొకేషన్స్ ఉన్నా.. కొత్త ప్రాంతాలలో పిక్చరైజ్ చేస్తే చూపరులకు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అందుకే అనేక సినిమాలు ఇదే రూట్ లో ఉన్నా.. అందరికీ ఈ విజువల్స్ ను ఆకట్టుకునేలా చూపించడం రావడం లేదు.

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ఆచారి అమెరికా యాత్రను.. మెజారిటీ పార్ట్ యూఎస్ఏలోనే చిత్రీకరించారు. కథ ప్రకారం సినిమాలో ఎక్కువ భాగం అక్కడే నడుస్తుంది. మరి హీరో అన్నాక లవ్ స్టోరీ.. సాంగ్స్ కూడా తప్పకు కదా. అలా ప్రగ్యా జైస్వాల్ తో అక్కడే పాటలు పాడుకుంటాడు హీరో. రీసెంట్ గా రిలీజ్ చేసిన చెలియా సాంగ్ ప్రోమో చూస్తే.. ఎవరైనా అట్రాక్ట్ కావాల్సిందే. అమెరికాలో ఎన్నేసి అందమైన లొకేషన్స్ ఉన్నాయో.. దాదాపు అన్నిటినీ కవర్ చేసేశారని అనిపిస్తుంది. జనాలకు తెలిసిన లొకేషన్స్ మాత్రమే కాకుండా.. అంతగా తెలియని అనేక సుందరమైన ప్రాంతాలలో కూడా పాటల చిత్రీకరణ చేశారు.

ఆచారి అమెరికా యాత్రలో చెలియా సాంగ్ ఒక విజువల్ ఫీస్ట్ అయిపోతుందని చెప్పేయచ్చు. ఇక ప్రగ్యా జైస్వాల్ అందాలు.. మంచు విష్ణు హీరోయిజం.. ఈ పాటను మరో రేంజ్ కు తీసుకెళ్లిపోయాయి. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఆచారి అమెరికా యాత్రను జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందించగా జనవరి26న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.