Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ సినిమా డిసెంబ‌రు 4న విడుద‌ల‌

By:  Tupaki Desk   |   27 Nov 2015 3:24 PM GMT
క‌మ‌ల్ సినిమా డిసెంబ‌రు 4న విడుద‌ల‌
X
చీక‌టి రాజ్యం విడుద‌లై వారం రోజులే అయింది. దీని త‌మిళ వెర్ష‌న్ తూంగావ‌నం అంత‌కు ప‌ది రోజుల ముందు రిలీజైంది. ఇంత‌లోనే క‌మ‌ల్ సినిమా విడుద‌ల ఏంటి? విశ్వ‌రూపం-2 ఏమైనా బ‌య‌టికొస్తోందా? లేక క‌మ‌ల్ ఇంకేదైనా సినిమా చేశాడా? ఐతే డిసెంబ‌రు 4న రాబోయేది కొత్త సినిమా ఏమీ కాదు.. తూంగావ‌నం మూవీనే. మ‌రి డిసెంబ‌రు 4న కొత్త‌గా విడుద‌ల కావ‌డ‌మేంటి అంటే.. అది ఇంట‌ర్నెట్ రిలీజ్. త‌మిళ‌నాట పైర‌సీ బెడ‌ద తీవ్రంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తూంగావ‌నం పైర‌సీ వెర్ష‌న్ ఇంట‌రె్న‌ట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈ పైర‌సీ భూతానికి అడ్డు క‌ట్ట వేయ‌డం కోసం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అఫీషియ‌ల్ ప్రింట్ ను ఆన్ లైన్లో రిలీజ్ చేయాల‌ని డిసైడ‌య్యాడు క‌మ‌ల్‌. అందుకే తూంగావ‌నం చిత్రాన్ని డిసెంబ‌రు 4న నేరుగా ఇంట‌ర్నెంట్లో రిలీజ్ చేసేస్తున్నాడు క‌మ‌ల్‌. హెచ్‌ డీ క్వాలిటీతో 5.1 స‌రౌండ్ సిస్టంతో సినిమా చూసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారాయ‌న‌. ధ‌ర కూడా త‌క్కువే ఉంటుంద‌ని అంటున్నారు.

తూంగావ‌నం న‌వంబ‌రు 10న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా.. స‌రిగ్గా 25 రోజుల‌కే ఇంట‌ర్నెట్ లోకి అఫీషియ‌ల్ గా వ‌చ్చేస్తుండ‌టం విశేష‌మే. ఇంత‌కుముందు విశ్వ‌రూపం సినిమాను థియేట్రిక‌ల్ రిలీజ్ తో పాటే డీటీహెచ్ లో విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన క‌మ‌ల్‌.. ఇప్పుడు ఓ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నాడు. భ‌విష్య‌త్తులో సినిమాను నేరుగా ఇంట‌ర్నెట్లో విడుద‌ల చేసే రోజులు కూడా వ‌స్తాయ‌న్న క‌మ‌ల్‌.. కొన్నేళ్ల త‌ర్వాత ఆ సాహ‌సం కూడా త‌నే చేస్తాడేమో చూడాలి.