బాహుబలిలో సెలెక్ట్ చేసి తీసేశారు

Thu May 24 2018 20:00:01 GMT+0530 (IST)

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వెతుకులాటలో చాలా మంది నటీనటులకు టెక్నీషియన్స్ కి కొందరు పరిచయం అవుతుంటారు. ఏ ఒక్కరు సక్సెస్ అయినా కూడా మరొకరు సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేలా చేయడం ఇండస్ట్రీలో కామన్. అయితే అదే తరహాలో దర్శకదీరుడు రాజమౌళి తన మొదటి కెరీర్ నుంచి పరిచయం ఉన్న శేఖర్ అనే నటుడుకి జక్కన్న లైఫ్ ఇచ్చాడు. చాలా వరకు ప్రతి సినిమాలో రాజమౌళి ఆయన్ను గట్టిగా వాడేవారు.ఛత్రపతి సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి క్రేజ్ అందుకున్నాడు. రాజమౌళి సినిమాల్లో శేఖర్ తప్పకుండా ఉంటాడు అనే విధంగా ఒక టాక్ ఉండిపోయింది. ఇక బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో అతను కనిపించకపోవడంతో కొందరు షాక్ అయ్యారు. అయితే మొదట్లో అతనికి క్యారెక్టర్ ఇచ్చారట. 20 రోజుల వరకు షూటింగ్ ఉంటుందని కూడా డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ సమయం దగ్గర పడుతున్నప్పుడు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో శేఖర్ రాజమౌళి ఆఫీస్ దగ్గరకి వెళ్లాడట.

ఏంటని అడగ్గా.. రాజమౌళి సమాధానం ఇస్తూ.. ఎందుకో ఆ ఎపిసోడ్ కథకు అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఎదో విధంగా నిన్ను పెట్టి తీయవచ్చు కానీ అంతగా బావుండకపోవచ్చు. అలా నిన్ను చూపెట్టడం నాకు ఇష్టం లేదని   చెబుతూ.. మేనేజర్ కి నిన్ను తీసేసినట్లు ముందే చెప్పాలని నేను చెప్పాను. కానీ వాళ్లు నీకు తెలుపకపోడం మిస్టేక్ అయ్యిందని రాజమౌలి చెప్పాడట. శేఖర్ కూడా ఏ మాత్రం నిరాశ చెందకుండా వెనక్కి వచ్చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.