Begin typing your search above and press return to search.

రెండు టాటూలు పొడిపించుకుందిగా..

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:18 AM GMT
రెండు టాటూలు పొడిపించుకుందిగా..
X
తెలుగు సినిమాలలో పక్క రాష్ట్రం నుండి వచ్చి పక్కా తెలుగు అమ్మాయిలానే మారి ఇక్కడే స్థిరపడ్డ హిరోయిన్లలో ఇప్పుడు రకుల్ అయితే అప్పుడు ఛార్మి అనే చెప్పాలి. అనుకోకుండా ఒక రోజు సినిమా కన్నా ముందు చాలా తెలుగు సినిమాలు చేసినా నటిగా స్టార్ గా గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ సినిమానే చెప్పాలి. మంత్ర సినిమాతో తెలుగు ఉత్తమ నంది అవార్డ్ కూడా వచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న ఛార్మి మళ్ళీ జ్యోతి లక్ష్మిగా అందరినీ పలకరించింది. కాకపోతే ఈ సినిమాకు ప్రేక్షకులు అంతగా పులకరించలేదు. ఇప్పుడు ఇలా ట్యాటూలతో రచ్చ చేస్తోంది.

ఇప్పుడు హిరోయిన్లు తన ఫ్యాషన్ డ్రెస్ వలన హాట్ ఫోటో షూట్ వలన కాకుండా ఒంటి మీద వేసుకున్న ట్యాటూ వలన కూడా వార్తల్లోకి వస్తున్నారు. కొంత మంది స్టైల్ కోసం కొంతమంది ప్రేమ కోసం మరికొందరు ఆదర్శాలు కోసం కూడా వేసుకుంటారు వీటిని. ఇప్పుడు ముద్దు గుమ్మ ఛార్మి కూడా.. పోర్చుగల్ లో 'పైసా వసూల్' షూటింగుకు వెళ్ళి.. అక్కడ తన ఆలోచనలకు తగ్గట్టు స్పానిస్ భాషలో తన కాలు పై ఒక టాటూ వేయించుకుంది. దాన్ని ఇలా మనం అర్ధం చేసుకోవచ్చు “మీరు నా అంతరాత్మ ను అర్ధం చేసుకోవాలి అంటే నా పిచ్చిని కూడా అర్ధం చేసుకోవాలిసి ఉంటుంది”. ఇంతటితో ఆగకా మరో టాటూ కూడా వేసుకుంది తన చేతి పైన “లిమిటెడ్ ఎడిషన్” అని. దీన్ని ఇంకా ఇప్పటి స్పీడ్ ప్రపంచంలో ఎలా అర్ధం చేసుకోవలో అలా అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి అందాలు మరి లిమిటెడ్ ఎడిషన్ కాక ఏమవుతాయిలే.

హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు ఫ్యాషన్ స్టేట్మెంట్ లతో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది ఛార్మి. ఈ మధ్యనే గురుద్వార్ కి పొట్టి బట్టలు వేసుకొని వెళ్ళి చీవాట్లు తినేసింది ఈ తెలివైన పిచ్చి పిల్ల.​ ఇక పూరి కనక్ట్స్ గురించి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/