Begin typing your search above and press return to search.

పంజాబీ పాప..ఇక దుకాణం సర్దేసుకోవచ్చు

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:56 PM GMT
పంజాబీ పాప..ఇక దుకాణం సర్దేసుకోవచ్చు
X
ఒక హీరోయిన్ కు పదేళ్లకు పైగా కెరీర్ ఉండటమంటే చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత ఘనత ఛార్మి సొంతం చేసుకుంది. ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేసి పుష్కరం దాటిపోవడం విశేషమే. ఐతే ఇప్పటికీ పంజాబీ పాప వయసు 28 ఏళ్లే. ఈ వయసుకి కొందరు హీరోయిన్లు పీక్స్ లో ఉన్నారు కానీ.. ఛార్మి మాత్రం 24-25 ఏళ్లకే ఫేడవుట్ అయిపోయింది. మూణ్నాలుగేళ్లుగా ఆమె కెరీర్ ఏమాత్రం బాగా లేదు. ఓ దశలో ఛార్మి సినిమా విడుదలవుతున్న సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి వచ్చేసింది. ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఏడాది పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసే ఛాన్స్ కొట్టేసింది ఛార్మి.

జ్యోతిలక్ష్మీ పుణ్యమా అని కొన్ని నెలలుగా ఛార్మి పేరు బాగానే వినిపిస్తోంది. ఈ ఊపులోనే విడుదలకు నోచుకోని మంత్ర-2ను కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేశారు. కానీ జ్యోతిలక్ష్మీ కానీ, మంత్ర-2 కానీ జనాల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. జ్యోతిలక్ష్మీ తర్వాత మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఛార్మి ఆశించింది కానీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అలాంటి అవకాశాలేమీ కనిపించడం లేదు. తాజాగా మంత్ర-2 పరిస్థితేంటో కూడా తొలి రోజే తేలిపోయింది కాబట్టి ఛార్మికి ఇక కష్టమే. జ్యోతిలక్ష్మీ విడుదల టైంలో పూరి సీక్వెల్ కబుర్లు బాగానే చెప్పాడు కానీ.. మళ్లీ ఛార్మి జోలికి వెళ్తాడని ఎవ్వరూ అనుకోవట్లేదు. కొత్తగా అవకాశాలేమీ వచ్చేలా కనిపించట్లేదు కాబట్టి.. ఛార్మి 13 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నందుకు సంతృప్తి చెంది, ఇక పెళ్లి చేసుకుని సెటిలైపోతే బెటర్.