ఛార్మీ ఎక్కడికీ వెళ్ళదట!

Tue Feb 12 2019 11:46:18 GMT+0530 (IST)

హీరోయిన్ గా కొన్నేళ్ల క్రితం వరకు చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన ఛార్మీ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రొడక్షన్ టీమ్ లో కీలక సభ్యురాలిగా మారడం చూస్తూనే ఉన్నాం. పూరితో జ్యోతిలక్ష్మి చేసాక ఛార్మీ పూర్తిగా నటనకు స్వస్తి చెప్పి నిర్మాణం వైపు అడుగులు వేసింది. ఆడినా ఆడకపోయినా పూరి సినిమాలకు పార్ట్నర్ గా ఉంటూ వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కాస్టింగ్ లాంటి వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటోంది.మెహబూబా ఫలితం వచ్చాక ఛార్మీకి చాలా నష్టం వచ్చిందని ఇక పూరితో టై అప్ కాదని గత ఏడాది కొన్ని కథనాలు వచ్చాయి. అయితే రామ్ తో పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ తో పాటు ఆకాష్ పూరి హీరోగా పూరి రచనలో తీస్తున్న రొమాంటిక్ లో కూడా ప్రొడక్షన్ పార్టనర్ గా ఛార్మీ నే అంతా చూసుకుంటోంది. నిన్న రొమాంటిక్ గురించి ఫేస్ బుక్ లో వీడియో అనౌన్స్ మెంట్ కూడా తనే చేసింది.

పూరి కంటే ఎక్కువగా ఛార్మీనే మీడియాతో మాట్లాడే బాధ్యతలు తీసుకుంటోంది. దర్శకుడిగా పూరి తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెడుతున్నాడు. అతని మీద ఒత్తిడి లేకుండా ప్రొడక్షన్ మొత్తం ఛార్మీనే చూసుకుంటోంది. ఐస్మార్ట్ శంకర్ రొమాంటిక్ ఫలితాల మీద ధీమాగా ఉన్న ఛార్మీ నిర్మాతగా సక్సెస్ జెండా ఎగురవేయడం కోసం ఎదురు చూస్తోంది. జ్యోతిలక్ష్మి లో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాక ఛార్మీ సినిమాలకు స్వస్తి చెప్పడం అభిమానులకు బాధ కలిగించినా ఇలా నిర్మాతగా ఉంటూ ఏదో ఒకరోజు యాక్టింగ్ కం బ్యాక్ ఇస్తుందనే అంచనాలో ఉన్నారు. చూద్దాం ఏదైనా పూరి సినిమాలోనే తిరిగి వస్తుందేమో