పొట్టి గౌనుతో వెళ్లి.. పిచ్చి తిట్లు తింటోంది

Sun Jun 18 2017 15:54:47 GMT+0530 (IST)

వివాదాలతో నలుగురు నోట్లో నానాలని సెలబ్రిటీలు అనుకుంటున్నారా? అన్న సందేహం కలిగేలా కొందరి ప్రవర్తన ఉంటోంది. ఎవరికి వారు తమ అభిప్రాయాల్ని ఓపెన్‌గా చెప్పేసే సోషల్ మీడియా ఉన్న వేళ.. సెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేము.. మా ఇష్టం అని చెప్పుకోవటానికి బాగున్నా.. వివాదం ముదిరి.. లేనిపోని తిప్పలు వచ్చాక చింతించటం కొందరి ప్రముఖులకు ఒక అలవాటుగా మారింది.

తాజాగా అదే రీతిలో వ్యవహరించి అడ్డంగా బుక్ అయింది ఛార్మి. చేతిలో సినిమాలు లేని ఈ సుందరి.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు పెద్ద రచ్చే అవుతోంది. ఎవరు ఎం ధరించాలన్నది వారి.. వారి వ్యక్తిగత నిర్ణయం మీద ఉంటుంది. కానీ.. కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. కొందరు ప్రముఖుల్ని కలిసేటప్పుడు వస్త్రధారణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మొన్నామధ్య ప్రధాని మోడీని కలిసే వేళ.. హాలీవుడ్ కమ్ బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా వేసుకున్న పొట్టి గౌను మీద పెద్ద రచ్చే నడిచింది. కనీసం.. ఈ రచ్చ అయినా చార్మికి ఒక హెచ్చరికలా పని చేయనట్లుంది. తాజాగా గురుద్వార్ కు వెళ్లిన చార్మి సంప్రదాయబద్ధంగా కాకుండా తనకు తోచినట్లుగా మోకాళ్ల దాకా ఉండే లాంగ్ గౌన్ వేసుకుంది. అక్కడ ఆశీస్సులు తీసుకునే సమయంలో కింద కూర్చున్నప్పుడు.. ఆమె కాళ్ల భాగం మొత్తం కనిపించే ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంకేముంది.. సంప్రదాయవాదులు చెలరేగిపోయారు. ప్రియాంకకు బుద్ధి లేదు..నీకేమౌంది? ఈ ఫ్యాషన్ సెన్స్ చూపించుకోవటానికి పవిత్రమైన గురుద్వారే దొరికిందా? అంటూ ఫైర్ అవుతున్నారు. తాజా వివాదాన్ని చూసిన పలువురు.. లేని వివాదాన్ని నెత్తిన వేసుకోవటమంటే ఇదేనేమో? అంటూ తెగ చిరాకు పడిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/