Begin typing your search above and press return to search.

ఛార్మి అక్కడేం 'మంత్రా'లు వేస్తోందో?

By:  Tupaki Desk   |   18 May 2017 9:58 AM GMT
ఛార్మి అక్కడేం మంత్రాలు వేస్తోందో?
X
అనుకోకుండా ఒక రోజు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని.. పౌర్ణమి- రాఖీ- మంత్ర లాంటి సినిమాలు చేసిన ఛార్మికి భారీ విజయాలు దక్కలేదు. రెండేళ్ల క్రితం జ్యోతిలక్ష్మి తో మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందని అనుకున్నా.. ఆ ఆశలు వమ్మయిపోయాయి. ఇప్పుడు మరోసారి పూరీ జగన్నాధ్ సినిమాలో ఛార్మీ ఓ కీలక పాత్ర చేస్తునట్లు పుకార్లు వస్తున్నాయి.

ఛార్మి కౌర్ పుట్టినరోజు సంధర్భంగా తనుకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు ఈ థాంక్స్ కంటే.. వాటిని పోర్చుగల్ నుంచి చెప్పడమే అసలు విషయం. అంటే ఇప్పుడు ఛార్మీ ఇప్పుడు పోర్చుగల్ లో ఉందనే విషయం అందరికీ అర్ధమైంది. ప్రస్తుతం పూరీ - బాలయ్యల సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. మరి ఇప్పుడు ఛార్మి అక్కడ ఏం చేస్తుందనే ప్రశ్న అందరి మదిలోను మొదలైంది. ఈ ప్రాజెక్టు ప్రొడక్షన్ విషయాల్లో ఛార్మి కొంత వరకు భాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీకి క్యాస్టింగ్ లో కూడా ఛార్మి హస్తం ఉంది.

అన్నీ కలిసి చూస్తే పూరీ–బాలయ్య సినిమాలో ఛార్మీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తోందనే విషయం దాదాపు కన్ఫాం అయిపోయినట్లే. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చెయ్యడానికి అన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి. క్రేజీ కాంబినేషన్ తో రూపొందుతున్న ఈ మూవీలో.. ఛార్మి ఎంట్రీ ఇంకాస్త ఎక్కువ ఆసక్తి పెంచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/