అందులో ఫెయిల్ అవుతున్న ఛార్మి

Mon May 14 2018 23:00:01 GMT+0530 (IST)

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లలో ఛార్మి కౌర్ కూడా సీనియర్ హీరోయిన్ అని చెప్పాలి. దాదాపు పదిహేనేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ రోల్స్ మరియు ఐటెమ్ సాంగ్స్ తో బాగానే అలరించింది. మంచి నటిగా కూడా గుర్తింపు పొందింది. కృష్ణ వంశీ లాంటి దర్శకుడు అయితే నటనలో ది బెస్ట్ హీరోయిన్ ఛార్మి అని ఒక ఇంటర్వ్యూలో ఆమెను పొగిడారు. కానీ అమ్మడి బ్యాడ్ లక్ ఏమిటో గాని కెరీర్ లో పెద్దగా స్టార్ డమ్ తెచ్చుకోలేదు.గ్లామర్ పాత్రల్లో ఎంత ఘాటుగా కవ్వించినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ ని చూడలేదు. ఇక సినిమాలకు టాటా చెప్పేసి ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అవ్వాలని అనుకుంది. అందుకోసం పూరి జగన్నాథ్ టీమ్ తో కలిసి కో ప్రొడ్యూసర్ గా ప్రయత్నాలు చేసింది. కానీ అమ్మడికి ఇక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. జ్యోతి లక్ష్మి సినిమాతో తనే ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన ఈ లేడి వరుసగా రోగ్ - పైసా వసూల్ సినిమాలకు వర్క్ చేసింది. ఆ సినిమాలతో కూడా హిట్టు అందుకోలేదు. ఇక ఫైనల్ గా పూరి తన తనయుడితో ఎంతో ప్రేమతో చేసిన మెహబూబా కూడా నిరాశపరిచింది.

పూరి డైరెక్షన్ లో మ్యాటర్ తగ్గిందని ఈ సినిమాతో అనేక రకాలుగా కామెంట్స్ వినబడుతున్నాయ్. దీంతో ప్రొడక్షన్ వర్క్ లో ఎంతో కష్టపడుతోన్న చార్మీకి కూడా పెద్దగా గుర్తింపు రావడం లేదు. దాదాపు ఆమె కూడా ఫెయిల్ అయినట్లే. మరి ముందు ముందు కూడా అమ్మడు ఇలానే చేస్తుందా లేక మళ్లీ నటనపై దృష్టి పెడుతుందా అనేది చూడాలి.