Begin typing your search above and press return to search.

కళ్లు మూసుకుని కిస్సులు లాగించిన ఛార్మి

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:44 AM GMT
కళ్లు మూసుకుని కిస్సులు లాగించిన ఛార్మి
X
కెరీర్ పరంగా సీనియర్ అయి.. సీనియర్ హీరోయిన్ అనిపించుకునే లోపే సైడ్ అయిపోయింది ఛార్మీ. అటు గ్లామర్ తో పాటు మధ్యమధ్యలో పెర్ఫామెన్స్ పాత్రలను కూడా బాగానే కవర్ చేసింది. అడపాదడపా ఐటెం సాంగ్స్ లో కూడా మెప్పించినా.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు జ్యోతిలక్ష్మితో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

పైకి చెప్పకపోయినా జ్యోతిలక్ష్మి ఎఫెక్ట్ ఛార్మీ కౌర్ పై గట్టిగానే పడింది. ఆ తర్వాత ఒక సినిమాలో కూడా నటించలేకపోయిన ఈ భామ.. ఇప్పుడు ఫ్రీ టైమ్ ను బాగా ఎంజాయ్ చేసేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు - టూర్లు - వెకేషన్స్.. ప్రపంచంలో రకరకాల ప్రాంతాలకు చెక్కేసి తెగ హుషారుగా గడిపేస్తోంది. ఆఫర్లు లేనంత మాత్రాన ఆనందంగా ఉండకూడదా ఏంటి అని నిలదీసినట్లుగా ఉంది అమ్మడి వాలకం. రీసెంట్ గా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ సైట్లలో పోస్ట్ చేసింది ఛార్మీ.

వీటిలో ఓ స్నేహితురాలు ఛార్మీని గట్టిగా పట్టుకుని బుగ్గపై ముద్దులు కురిపించేస్తోంది. ఈ బొద్దు భామ కూడా ఆ ముద్దులను కళ్లు మూసుకుని మరీ బాగా ఎంజాయ్ చేసేస్తోంది. ఇంకా కోపరేట్ కూడా చేస్తోంది. 'లవ్ మి లక్ యు డూ..లలలా' అంటూ ఓ చిన్న సైజ్ పాటను కూడా పోస్ట్ చేసిందండోయ్. మొత్తానికి ఛార్మీ తనకు దొరికిన ఖాళీ టైంను ఏ రేంజ్ లో ఎంజాయ్మెంట్ కి ఉపయోగించుకుంటోందో.. ఈ కిస్సింగ్ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఛార్మీ.. ఆ ఫోటోల్లో ఉన్నదెవరో చెబ్తే బాగుండేది కదా!