ఊపు మీద డాన్స్ చేస్తోన్న చార్మీ

Wed May 16 2018 16:00:30 GMT+0530 (IST)

ఒకప్పుడు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు కేవలం వీడియోల వలనో ఫోటోల వలనో లైం లైట్ లోకి వస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో ఛార్మి ఒకరు. అప్పట్లో వరుస ఆఫర్లతో బిజీ బిజీ గా గడిపిన ఈ 'మంత్ర' బ్యూటీ ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తోంది. తెరపైన మెరవటం ఆపేసి పూరి జగన్నాధ్ తో కలిసి తెర వెనుక ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది.



ఛార్మి ఓ రేంజులో డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యనే పూరి తన కొడుకు ఆకాష్ పూరిని మెహబూబా సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశాడు. సినిమా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఛార్మి కూడా కొంత పాత్ర వహించింది. ఈమధ్యనే కనిపిస్తున్న వీడియో కాబట్టి ఇది సినిమా సక్సెస్ మీట్ తర్వాత తీసిన వీడియోనే అయి ఉంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే సంతోషంతో డాన్స్ చేస్తే ఒక అర్ధం ఉంటుంది. సినిమా ఏమి పెద్దగా ఆడట్లేదు. మొన్నటికి మొన్న పూరి కూడా ఇది నేను చేసిన మొట్టమొదటి జెన్యూన్ ప్రేమకథ దయచేసి ఆదరించండి అంటూ మోర పెట్టుకున్నాడు. ఇటు చూస్తే ఛార్మి ఏమో సినిమా బ్లాక్ బస్టర్ అయిన రేంజ్ లో తెగ డాన్స్ చేస్తోంది.

అయితే ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న రెండు ఖాళీ గ్లాసులు.. మరో చేతిలోని విస్కీ బాటిల్ తెగ హైలైట్ అవుతున్నాయి. మరి ఛార్మి ఏమన్నా తీర్ధం పుచ్చుకుందా అనే సందేహాలు ఆరవడం సహజమే కాని.. అక్కడి వాతావరణం చూస్తుంటే.. ఇదేదో పార్టీ మొదలవ్వడానికి ముందు చేసిన సరదా డ్యాన్సులా ఉంది. కాని ఆమె ఊపును చూసి యువత చెవులు కొరికేసుకుంటున్నారు అనుకోండి.

వీడియో కోసం క్లిక్ చేయండి