Begin typing your search above and press return to search.

ఛార్మీ.. ఏకంగా ఏక్తాకపూర్ తో పోలుస్తున్నారే!

By:  Tupaki Desk   |   14 July 2019 5:30 PM GMT
ఛార్మీ.. ఏకంగా ఏక్తాకపూర్ తో పోలుస్తున్నారే!
X
రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాకు ఛార్మీ నిర్మాత అనే సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వంలో పలు చిత్రాలకు ప్రొడక్షన్ బాధ్యతలు చూసిన ఛార్మీ ఈ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా తన లక్కును టెస్ట్ చేసుకుంటోంది. గతంలో కూడా పూరి సినిమాలకు ఛార్మీ సహనిర్మాతగా వ్యవహరించింది. అయితే అవేవీ లాభాలనివ్వలేదట.

'ఇస్మార్ట్ శంకర్' పై మాత్రం టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఈ సినిమా నిర్మాణంలో ప్రతి అంశంలోనూ ఛార్మీ యాక్టివ్ గా పాలుపంచుకుందట. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఛార్మీ ని బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తో పోలుస్తున్నారు. ఎందుకంటే లేడీ ప్రొడ్యూసర్స్ అనగానే ఫెమినిజం అని మరోటని మాట్లాడుతూ.. నిర్మాతలందరూ ఉండే మైండ్ సెట్ కు భిన్నంగా ప్రవర్తించడం జరుగుతుందనే ఒక జెనరల్ అభిప్రాయం ఉంది. కానీ ఏక్తా కపూర్ లాంటి వారు మాత్రం సినిమా అంటే... సినిమానే. అందుకే హాట్ భామలతో బోల్డ్ సీన్లు తన సినిమాల్లో పెట్టేందుకు ఏక్తా వెనకడుగు వేయదు. ఇప్పుడు ఛార్మీ కూడా అదేరకంగా ఉందట. 'ఇస్మార్ట్ శంకర్' లో హీరోయిన్ల బోల్డ్ టాక్.. విమర్శలు రేకెత్తే విధంగా ఉన్న సీన్లు చూస్తే ఈ సినిమాకు ఒక లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారని ఎవరూ అనుకోరు. ఛార్మీ బిజినెస్ ను బిజినెస్ గానే చూస్తుందని.. అందులో ఏ జఫ్ఫాయిజాలను మిక్స్ చేయదని అంటున్నారు.

రీసెంట్ గా గుంటూర్ కు ఇస్మార్ట్ టీమ్ వెళ్ళిన సమయంలో హీరోయిన్లు యమా హాటుగా డ్రెస్ ధరించారట. ఆ హాట్ డ్రెస్ ను ఎంపిక చేయడం వెనక ఉన్నది ఛార్మీ అని సమాచారం. ఇదంతా ఒకే. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ ఏక్తా కపూర్ అని బిరుదు కూడా ఇస్తారు.. కానీ సినిమా కనుక అటూ ఇటూ అయితే మాత్రం ఇదే జనాలు 'ఏక్తా కపూర్ కాదు ఏమీ లేని కపూర్' అని విమర్శిస్తారు.