Begin typing your search above and press return to search.

క్రియేటివ్ డైరెక్టర్ మొదలెట్టేశాడహో

By:  Tupaki Desk   |   30 Nov 2015 7:42 AM GMT
క్రియేటివ్ డైరెక్టర్ మొదలెట్టేశాడహో
X
కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయ్యాడన్నది పక్కనబెడితే.. తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించి కొత్త తరహా సినిమాలు కోరుకునే ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి. ఐతే దగ్గర్నుంచి సాహసం వరకు ఆయన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకునే ఏలేటి ‘సాహసం’ వచ్చిన రెండున్నరేళ్లకు తన కొత్త సినిమా మొదలుపెట్టాడు.

సాయి కొర్రపాటి నిర్మాణంలో చంద్రశేఖర్ ఏలేటి కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు ఇంతకుముందు ‘మహిమ’ అనే టైటిల్ వినిపించింది కానీ.. ఏలేటి మాత్రం ‘మనమంతా’ అనే టైటిల్ ఖాయం చేశాడు. మోహన్ లాల్ - గౌతమి - ఇర్ఫాన్ ఖాన్ లాంటి గ్రేట్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. తెలుగు - తమిళ - మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కబోతోంది.

దాదాపు ఏడాది పాటు ఈ సినిమా స్క్రిప్టు మీద పని చేశాడట ఏలేటి. మధ్య తరగతి జీవితాల్ని ప్రతిబింబించే కథ ఇదని.. ఏలేటి స్టయిల్లోనే చాలా భిన్నంగా ఉంటుందంటున్నారు. మోహన్ లాల్ - ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్లు నటించడానికి ఒప్పుకున్నారంటేనే స్క్రిప్టులో ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుందిలెండి.