Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ మళ్లీ వస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 April 2017 4:57 AM GMT
ట్యాలెంటెడ్ డైరెక్టర్ మళ్లీ వస్తున్నాడు
X
ఆ నలుగురు.. మధుమాసం వంటి హిట్ చిత్రాలను అందించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్ధ.. మూడేళ్ల క్రితం 'ఏమో గుర్రం ఎగరావచ్చు' వంటి సినిమాలు అందించాడు. అయితే మూడేళ్ల నుంచి కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయని ఈ దర్శకుడు.. ఇప్పుడు మరోసారి వైవిధ్యపాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

మూడేళ్ల తర్వాత ఓ విభిన్నమైన స్క్రిప్ట్ ను ఈ దర్శకుడు సిద్ధం చేసుకున్నాడని.. ఈ మూవీ అంతా రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ప్రధానంగా కాటికాపరి పాత్ర ఈ చిత్రంలో అత్యంత ముఖ్యమైనది కాగా.. ఈ రోల్ ను రావు రమేష్ తో చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో ముఖ్యమైన పాత్రను జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పోషించబోతున్నాడు. ఫిలిం ఇండస్ట్రీలో ఆదికి ఇది తొలి లాంఛింగ్ మూవీగా నిలవనుంది.

మే నెల మొదటి వారం నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రముఖ రైటర్ గద్దర్ ఈ మూవీకి కొన్ని పాటలు అందించనున్నాడని తెలుస్తోంది. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. వేగంగా ఈ మూవీ షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/