ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య చేయగలడా అని భయమేసింది – చంద్రబాబు

Fri Jan 11 2019 16:54:11 GMT+0530 (IST)

ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయి సక్సెస్ పుల్ గా దూసుకువెళ్తుంది. ఇప్పటి వరకు చూసిన వాళ్లంతా బాగుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేయడం కోసం బాలయ్య పడిన కష్టం స్క్రీన్ కన్పించిందని ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు. అయితే.. బయోపిక్ సినిమాను అందరు చూడడం వేరు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూడడం వేరు. అందుకే ఆయన.. విజయవాడలోని ఓ మల్టీప్లెక్స్ లో బాలయ్య చిత్ర దర్శకుడు క్రిష్ తో కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.“ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారు. చాలా అద్భుతంగా నటించారు. అసలు ఈ సినిమా ఈ పాత్ర బాలయ్య చేయగలడా అనే అనుమానాలు మొదట్లో ఉండేవి నాకు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు మూవీని చూసిన తర్వాత ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య మాత్రమే న్యాయం చేయగలడు అన్పించింది. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘనటలు అన్నీ అద్భుతంగా చూపించారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్టీఆర్ 30 ఏళ్ల సినీ జీవితాన్ని 3 గంటల్లో దర్శకుడు క్రిష్ అద్భుతంగా చూపించారు” అని ప్రశసించారు చంద్రబాబునాయుడు. ఇక ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటించాడు. మరి ఈ పాత్ర ఎలాఉంది రానా ఎలాచేశాడు అని మీడియా అడిగిన ప్రశ్నకు.. “దానికి సమాధానం మీరే చెప్పాలి” అంటూ నవ్వుకుంటూ వెళ్లి పోయారు చంద్రబాబునాయుడు.