మళ్ళీ కార్తికేయ మీదనే ఫోకస్

Sat May 20 2017 04:00:04 GMT+0530 (IST)

ఆ మధ్యన 'ప్రేమమ్' సినిమా తీసిన తరువాత.. హీరో వరుణ్ తేజ్ తో ఒక సినిమాను చేయడానికి పావులు కదిపాడు దర్శకుడు చందూ మొండేటి. కార్తికేయ సినిమాలో జంతువులను హిప్నటైజ్ చేయడం అనే కాన్సెప్టుతో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ దర్శకుడు.. తరువాత రీమేక్ సినిమా చేశాడు. ఆ తరువాత రైట్ హ్యాండ్ సిండ్రోమ్ అంటూ మరో మెడికల్ ప్రాబ్లమ్ తో సినిమా చేస్తాడని అనుకుంటే.. ఇప్పుడు ప్లాన్స్ మారిపోయాయ్.

తనతో తొలిసినిమాను చేసిన హీరోతోనే ఇప్పుడు చందు తదుపరి సినిమా చేయనున్నాడట. ఆల్రెడీ నిఖిల్ అండ్ చందు కలసి 'కార్తికేయ' సినిమాతో అలరించాక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా 'కార్తికేయ 2' తీస్తున్నారు. ఈ సినిమాలో సీక్వెల్ అని పేరు చెప్పి ఎలాగైతే అందరూ కేవలం పేరు వాడుకుని ఏదో కొత్త తీస్తున్నారో అలా కాకుండా.. ఇప్పుడు మనోళ్ళు మాత్రం ఆ సినిమా ఎక్కడ ఆగిపోయింది ఈ సినిమాను అక్కడ నుండే మొదలెట్టి కథను కొత్తగా మలుస్తారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్.

ఇకపోతే వరుసగా తనతో పనిచేసన కొత్త డైరక్టర్లకు నిఖిల్ మళ్లీ ఛాన్సులు ఇస్తున్నాడా అనిపిస్తోంది. ముందు నిఖిల్ తో స్వామిరారా చేసిన సుధీర్ వర్మ.. తరువాత నాగచైతన్యతో దోచెయ్ అంటూ దోచేసి.. తరువాత నిఖిల్ తోనే కేశవ తీశాడు. ఇప్పుడు చందూ కూడా నిఖిల్ తో కార్తికేయ తీసిన.. తరువాత నాగ చైతన్యతో ప్రేమమ్ చేసి.. మళ్ళీ ఇప్పుడు నిఖిల్ తో కార్తికేయ 2 అంటున్నాడు. భలే ఉందే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/