Begin typing your search above and press return to search.

సవ్యసాచిలో మాధవన్ ఎలా ఉన్నాడంటే..

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:32 PM GMT
సవ్యసాచిలో మాధవన్ ఎలా ఉన్నాడంటే..
X
ఈ ఏడాది మొదట రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య యుద్ధం శరణం సినిమాతో ఎవరు ఊహించని విధంగా కెరీర్ లో మరో డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రేమమ్ సినిమాతో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.

అయితే సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక సినిమాలో క్యాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. సినిమాలో హ్యాండ్సమ్ సీనియర్ హీరో మాధవన్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా మాధవన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సినిమా షూట్ లో మొదటి రోజు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ.. చిత్ర యూనిట్ ని పొగుడుతూ.. లవ్యూ .. అని ట్వీట్ చేశాడు. అసలు ఆ లుక్ లో మాధవన్ ను చూస్తే మాత్రం.. వాటే హ్యాండ్సమ్ డూడ్ అని అనకుండా ఎవ్వరూ ఉండలేరు. ఇక మాదవన్ వ్యాఖ్యలకు బదులుగా చైతూ కూడా తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశాడు. మేము ఎంత ఎదురుచూస్తున్నామో మీకు అస్సలు తెలియదు. థ్యాక్స్ ఏ టన్.. మేము అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం మీ నటన ఏ స్థాయిలో ఉందో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అంటూ కామెంట్ చేశాడు.

ఇకపోతే సవ్యసాచిలో ఈ చైతన్య ప్రక్కన బాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాకపోతే బాలీవుడ్లో ఘాటైన అందాలను తన తొలి చిత్రంలో గుమ్మరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్క మాత్రం హోమ్లీ పాత్రలో కనపడనుంది.