Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: యుట్యూబ్ పిల్ల డోస్ పెంచిందే

By:  Tupaki Desk   |   24 April 2017 6:57 AM GMT
ఫోటో స్టోరి: యుట్యూబ్ పిల్ల డోస్ పెంచిందే
X
ఆ మధ్యన 'కుందనపు బొమ్మ' వంటి సినిమాలతో విచ్చేసింది యుట్యూబ్ బ్యూటి చాందిని చౌదరి. అమ్మడు యుట్యూబ్ లో షార్టు ఫిలింస్ ద్వారా చాలా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే గ్లామరసం దరాబోయకుండా వెండితెరపై మాత్రం పాపులర్ అవ్వడం అంత తేలిక కాదు. ఈ విషయం కాస్త లేటుగా గ్రహించినట్లుంది చాందినీ. అందుకే రూటు మార్చింది.

అమ్మడు ఇప్పుడు ''హౌరా బ్రిడ్జ్'' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న చాందిని.. తన సోకులతో అందరినీ ఊరించేసింది. డీప్ నెక్ బ్యాక్.. షార్ట్ గౌన్.. అలరించే మేని ఛాయ.. వావ్ అనిపించేలా అందాలను దారబోసింది అమ్మడు. ఓ యాంగిల్లో చూస్తే చాలా హాటుగా స్టార్ హీరోయిన్లకు తీసిపోదు అన్నట్లే ఉంది పిల్ల.

ఈ తరంలో తెలుగు నుండి గ్లామరసం దారబోస్తూ యాక్టింగులో కూడా పరిణితి చూపించే హీరోయిన్లు చాలా తక్కువగానే ఉన్నారు. అందుకే కదా.. తమిళం నుండి వచ్చిన సమంత.. బొంబాయ్ బేబి తమన్నా ఇక్కడ పెద్ద స్టార్లు అయిపోయింది. మరి చాందిని కూడా వారి ప్లేస్ అందుకుంటుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/