Begin typing your search above and press return to search.

మళ్లీ నందమూరి బాక్సాఫీస్ వార్

By:  Tupaki Desk   |   25 March 2017 10:37 AM GMT
మళ్లీ నందమూరి బాక్సాఫీస్ వార్
X
పోయినేడాది ఎవ్వరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ సమరానికి సై అన్నారు నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్. ముందు వీళ్లిద్దరి మధ్య బాక్సాఫీస్ సమరం జరుగుతుందంటే చాలామంది నమ్మలేదు కానీ.. చివరికి ఇద్దరూ సంక్రాంతి రేసులో దిగిపోయారు. అప్పుడు బాబాయిపై అబ్బాయి స్పష్టమైన ఆధిపత్యం చలాయించాడు. ఐతే ఈ ఏడాది సైతం నందమూరి పోరు తప్పేలా కనిపించట్లేదు.

బాబాయ్. అబ్బాయ్ సినిమాలు ఈ ఏడాది దసరా రేసులో నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. నిజానికి ముందుగా దసరాకు బెర్తు బుక్ చేసుకున్నది బాలయ్యే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబరు 29కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాను ముందు ఆగస్టు 11కి అనుకున్నారు. కానీ ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లాల్సిన ఈ చిత్రం మార్చికి కానీ రెగ్యులర్ షూటింగ్ ఆరంభించుకోలేదు.

పూరి జగన్నాథ్ లాగా బాబీ శరవేగంగా షూటింగ్ కానిచ్చేసే అవకాశం లేదు. పైగా ఇది ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా. కాబట్టి లేటవుతుందని.. ఆగస్టు 11 డెడ్ లైన్ అందుకోవడం కష్టమని భావిస్తున్నారు. కాబట్టి తర్వాతి బిగ్ సీజన్ అంటే దసరానే. రిలీజ్ కోసం ఆ సీజన్నే టార్గెట్ చేసే అవకాశముంది. కాబట్టి మరోసారి నందమూరి హీరోల బాక్సాఫీస్ సమరం చూసేందుకు అవకాశాలున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/