కాజల్ కాకపోతే రకుల్ ని తెస్తారట!

Fri Oct 13 2017 13:34:49 GMT+0530 (IST)

రవితేజ కొత్త సినిమా రాజా ది గ్రేట్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీంతో పాటే విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు అనే మూవీ కూడా చేసేస్తున్నాడు మాస్ మహరాజ్. అయితే.. రాజా ది గ్రేట్ రిలీజ్ తర్వాత.. ఈ మాస్ హీరో కొత్త సినిమా ప్రకటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.తమిళ్ హిట్ మూవీ బోగన్ ను తెలుగులో రీమేక్ చేయనుండగా.. దీనికి ఇప్పటికే సైన్ చేశాడు రవితేజ. అయితే.. ఈ మూవీ హీరోయిన్ విషయంలోనే బోలెడన్ని పేర్లు వినిపించేస్తున్నాయి. ఇప్పటికే కేథరిన్ థ్రెసాతో అగ్రిమెంట్ చేసుకున్నారనే వార్తలు ఉన్నా.. ఆమెను తప్పించి కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారంటూ రీసెంట్ గా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ను తీసుకోవడం అనే విషయం ఇంకా కన్ఫాం కాలేదట. నిజానికి కేథరిన్ కు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నా.. చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం కూడా హీరోయిన్ వేట కొనసాగుతోందని.. ఒక వేళ కాజల్ కాదంటే.. ఆ ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కిక్2లో రవితేజ-రకుల్ జంటగా నటించారు కూడా. అయితే.. ఒక్క సినిమాలో ఒక హీరోయిన్ రోల్ కోసం.. ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించడం విచిత్రమే.