ట్రైలర్ టాక్: ఛలో భలే ఉందే

Thu Jan 18 2018 11:27:50 GMT+0530 (IST)

ఆల్రెడీ టీజర్ తో ఇంప్రెస్ చేసి.. సాంగ్స్ తో బాగా ఆకట్టుకుని.. ఇప్పుడు ట్రైలర్ తో కూడా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ''ఛలో'' అంటూ ఫిబ్రవరి 2న నూతన దర్శకుడు వెంకీ కుడుముల డైరక్షన్లో మన ముందుకు రాబోతున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ట్రైలర్ తో ఏం చెబుతున్నాడో చూద్దాం పదండి.బోర్డర్లో పక్కపక్కనే ఉన్న రెండు ఊళ్లు. ఒకటి తెలుగోళ్ల విలేజ్ అయితే రెండోది తమిలోళ్ల గ్రామం. అందుకే ఆ ఊళ్ళ మధ్యలోనుండి బోర్డర్ తెలిసేలా ఒక ఫెన్సింగ్. అలాంటి చోటుకు ఆ ఊళ్ళ తాలూకు గొడవల గురించి తెలియని హీరో వెళితే ఎలా ఉంటుంది? మంచి ఆసక్తికరమైన కథా కథనంతో ఇప్పుడు నాగ శౌర్య డిఫరెంట్ కథను మరోసారి ఎన్నుకున్నాడని ఇక్కడే అర్ధమవుతోంది. ట్రైలర్ మొత్తంలో ఆ ఊళ్ళ తాలూకు గొడవలు.. అలాగే వాటిని కామెడీగా సినిమాల ద్వారా చెప్పడం.. అదిరిపోయింది. ఇక హీరోయిన్ రష్మిక మందన్నా కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. శౌర్య అండ్ రష్మిక కెమిస్ర్టీ కూడా బాగానే పండినట్లుంది. మంచి కథకు ఉత్తమ కథనం మరియు రాకింగ్ యాక్టర్స్ తోడయ్యారు.

ఇకపోతే సినిమా కోసం సాయిశ్రీరామ్ అందించిన విజువల్స్ అలాగే మహతి స్వరసాగర్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టాప్ నాచ్ గా ఉండోబోతందని కూడా చెప్పుకోవచ్చు. ఛలో.. ఫిబ్రవరి 2న నాగశౌర్య పెద్ద హిట్టే కొట్టేలా ఉన్నాడు. లెటజ్ సీ.