Begin typing your search above and press return to search.

చ‌ల్ మోహ‌న్ రంగ‌ తమన్ ఖాతాలో మ‌రో హిట్!

By:  Tupaki Desk   |   18 March 2018 8:11 AM GMT
చ‌ల్ మోహ‌న్ రంగ‌ తమన్ ఖాతాలో మ‌రో హిట్!
X
లై త‌ర్వాత రాబోతోన్న `చల్ మోహ‌న్ రంగ‌` పై నితిన్ భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ - సుధాక‌ర్ రెడ్డి లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ సినిమాపై ప్రేక్ష‌కులకు భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తొలిప్రేమ కు హిట్ మ్యూజిక్ అందించి మంచి ఫామ్ లో ఉన్న థ‌మ‌న్ కంపోజ్ చేసిన‌ `పెద్ద పులి` సాంగ్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ పాప్ సింగ‌ర్ ఆకోన్ కు `పెద్ద‌పులి` పాట తెగ న‌చ్చేసింది. ఆ పాట‌కు థ‌మ‌న్ మంచి బీట్ ఇచ్చాడ‌ని, లిరిక్స్ అర్థం కాక‌పోయినా.....బీట్ కు త‌గ్గ డ్యాన్స్ ఆక‌ట్టుకుంద‌ని ఆకోన్ తెలిపాడు. తాజాగా, ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రంలోని పాట‌ల‌ను నిన్న సాయంత్రం విడుద‌ల చేశారు.

తొలిప్రేమ త‌ర‌హాలోనే థ‌మ‌న్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ప‌క్క మాస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టునొని...మ‌రోప‌క్క క్లాస్ సాంగ్స్ ను మిక్స్ చేయ‌డంలో థ‌మ‌న్ స‌క్సెస్ అయ్యాడు. దానికితోడు యూత్ ను ఆక‌ట్టుకునేలా మెలోడీ సాంగ్ ను కంపోజ్ చేశాడు. మొత్తం ఆరు పాట‌లు మాస్ , క్లాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇప్ప‌టికే యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తోన్న `పెద్ద‌పులి` పాట త‌ర‌హాలోనే మిగ‌తా పాట‌లు కూడా క్యాచీ ట్యూన్స్ తో ఆక‌ట్టుకుంటున్నాయి. నితిన్ - మేఘా ఆకాశ్ లు జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

పాటలు వినటానికి క్లిక్ చేయండి