గదిలో బికినీ బ్లర్ అయినట్లే!!

Wed Oct 11 2017 14:37:41 GMT+0530 (IST)


నాగ్ కెరీర్ లో మొట్ట మొదటి సారి హర్రర్ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాజు గారి గది 2. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులకు కూడా పూర్తి చేసుకుంది. ట్రైలర్ తో పాజిటివ్ టాక్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.  ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సమంత సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.అయితే సమంత ఆత్మగా కనిపిస్తుందని తెలిసిపోయింది. ఇక సినిమాలో సీరత్ కపూర్ మాత్రం గ్లామర్ తో అదరగొడుతుందనే కామెంట్స్ బాగా వినిపించాయి. అంతే కాకుండా ఒక ఎపిసోడ్ లో ఆమె బికినిలో కనిపించనుందట. ట్రైలర్లో ఆల్రెడీ ఈ సీన్ తాలూకు హింటు కూడా ఇచ్చేశారులే. అయితే ఆ సిన్ మరీ హాట్ గా ఉండడంతో సెన్సార్ యూనిట్ బికినీ అందాలను బ్లర్ చేయమని చెప్పడంతో గ్లామర్ షో కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉన్నటు తెలుస్తోంది. సీరత్ కపూర్ సినిమాలో పాత్ర అవసరమైందే కానీ గ్లామర్ పార్ట్ ఎంతో కొంత ఉండాలి కాబట్టి ఆమెను ఎంచుకున్నాడు దర్శకుడు.

అసలే అమ్మడు సినిమా చాన్సుల కోసం అంతకుముందు టాప్ లెస్ అందాలతో హాట్ ఫొటో షూట్స్ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు రాజు గారి గది లో ఆ అందాలు మసకబారితే ఎలా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి సినిమాలో మిగతా సీన్స్ లలో  ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే సీరత్ కపూర్ ఇటీవల సరైన పాత్ర వస్తే అందాలను లిమిట్స్ లేకుండా ప్రెజంట్ చేస్తానని చెప్పింది. అంతే కాకుండా సినిమా ఎండింగ్ వరకు బికినిలో కనిపించడానికి కూడా రెడీ అంటోంది.