Begin typing your search above and press return to search.

లిప్ లాక్ తోనే హైప్ తెస్తున్నారే..

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:58 AM GMT
లిప్ లాక్ తోనే హైప్ తెస్తున్నారే..
X
సినిమాల్లో లిప్ లాక్స్ ఉండడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అయితే కొన్ని సినిమాల్లో ఆ లిప్ లాక్స్ సక్సెస్ అవుతుంటే కొన్ని సినిమాల్లో అనవసరంగా ఉన్నాయని అనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమాకు అదే రూమర్ అంటుకుంది. అలాగే సినిమాలో సెన్సార్ సభ్యులు లిప్ లాక్ సీన్స్ ను కట్ చేశారని నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. ఆ సినిమా ఎదో కాదు. ప్రస్తుతం కాంట్రవర్సీల మధ్యలో రూపుదిద్దుకుంటున్న " ఏ జెంటిల్ మెన్ " మూవీ.

లవర్ బాయ్ సిద్ధార్థ్ మల్హోత్రా మరియు హాట్ బ్యూటీ జక్వాలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. అయితే వీరి మధ్య ఉన్న లవ్ సీన్స్ లో వచ్చే ఘాటైన ముద్దులు అసభ్యకరంగా అలాగే అనవసరంగా ఉన్నాయని ఇంతకుముందే సిబిఎఫ్సి ఛైర్మెన్ ఫలాజి నీహాలినిస్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ చిత్ర దర్శకులు రాజ్ మరియు డీకే మాత్రం సినిమాలో ఎటువంటి కట్స్ లేవని మళ్లీ సెన్సార్ సభ్యులతో మాట్లాడి సీన్స్ ను ఒకే చేయించారని తెలుస్తోంది. ఇక సినిమాలో లిప్ లాక్ సీన్స్ మధ్య ఎటువంటి కట్స్ కూడా ఉండవని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. చాలా ఎంజాయ్ చేస్తూ ఆ సీన్స్ ను తెరకెక్కించారట. అలాగే సిద్దార్థ - జక్వాలిన్ పోటాపోటీగా ముద్దులు ఇచ్చారని కూడా కామెంట్స్ వినబడుతున్నాయి.

చూడాలి మరి ఈ ముద్దుల కాంట్రవర్సీ తో సినిమా హైప్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి. ఈ నెల 25న ఏ జెంటిల్ మెన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది.