Begin typing your search above and press return to search.

జెంటిల్ మెన్ ముద్దు కట్

By:  Tupaki Desk   |   15 Aug 2017 9:45 AM GMT
జెంటిల్ మెన్ ముద్దు కట్
X
ఈ మధ్య కాలంలో లిప్ లాక్స్ సినిమాల్లో ఉండడం చాలా కామన్ అయిపోయింది. అయితే కొన్ని సినిమాలు కథలో సందర్భానుసారంగా వస్తుంటే మరి కొన్ని సినిమాల్లో జనాలను థియేటర్ల వరకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు సినిమా తీసేవాళ్ళు. దీంతో సెన్సార్ సభ్యులు కూడా సినిమాల్లో కొన్ని శృంగారం సీన్స్ ఏ మాత్రం మితిమీరిన కత్తెరకు పని చెప్పాలి అంటున్నారు.

రీసెంట్ గా ఇదే తరహాలో సిద్దార్థ్ మల్హోత్ర - జక్వాలిన్ ఫెర్నాండేజ్ కలిసి నటించిన " ఏ జెంటిల్ మెన్" సినిమాలోని కొన్ని సీన్స్ కి సెన్సార్ సభ్యులు కట్ చేయమని చెప్పారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 25న రిలీజ్ చేద్దామనుకున్న సినిమా యూనిట్ కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పెద్ద షాక్ ఇచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉందామనుకున్నారు.

కానీ కొన్ని సీన్స్ లో హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే కిస్ సీన్స్ మరీ వల్గర్ గా ఉన్నాయని సీబీ ఎఫ్ సి చైర్మన్ నిహాలనిస్ తెలిపారు. అంతే కాకుండా సినిమా లీడ్ పెయిర్ మధ్య కిస్ సీన్స్ అనవసరంగా పెట్టారట. జేమ్స్ బాండ్ సినిమాలోని మరియు రన్ బీర్ -అనుష్క్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ తరహా సీన్స్ ని పోలి ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ తరహా కిస్ లు బాలీవుడ్ కి కొత్తేమి కాదు ఇంతకుముందు చాలా సార్లు ఇంతకంటే ఘాటైన ముద్దులే తెరపై దర్శనమిచ్చాయి. అయితే ఏ జెంటిల్ మెన్ ముద్దులు మాత్రం బాగాలేవట. ఈ చిత్రాన్నీ రాజ్ - డీకే అనే ఇద్దరు దర్శకులు కామెడీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా 2014లో వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ అనే సినిమా కథకు కొనసాగింపుగా (సీక్వెల్) గా ఉండబోతోందట.