సాక్ష్యానికి సెన్సార్ అవుతుందా.. లేటా?

Mon Jul 23 2018 22:28:10 GMT+0530 (IST)

బెల్లంకొండ శ్రీనివాస్-పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకకెక్కిన 'సాక్ష్యం సినిమాను జూలై 27న విడుదల చేస్తామని ఫిలింమేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే.   కానీ ఈ సినిమా సెన్సార్ కనుక డిలే అయ్యే పక్షంలో ఒక రోజు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉందట.సంగతేంటంటే.. సాక్ష్యం సినిమా రేపు సెన్సార్ కు వెళ్తోంది.   అంటే మంగళవారం సాయంత్రానికి సర్టిఫికేట్ రావాలి. కానీ ఈ సినిమాలో పంచభూతాల కాన్సెప్ట్..  ఒక ఎద్దు(నందీశ్వరుడి అవతారం) కీలక పాత్ర ఉండడంతో 'సాక్ష్యం' టీమ్ కు యానిమల్ బోర్డు నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవలసిన అవసరం ఏర్పడింది.  యానిమల్ బోర్డు క్లియరెన్స్ లేకుండా సెన్సార్ వారు సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు.  దీంతో సెన్సార్ వారు మిగతా సినిమాకు తమ సెన్సారింగ్ పూర్తి చేసినా  గురువారం వరకూ యానిమల్ బోర్డు క్లియరెన్స్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.  అది వచ్చిన వెంటనే 'సాక్ష్యం' టీమ్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు.

ఒకవేళ అనుకోని ఇబ్బంది ఎదురై సెన్సార్ కనుక ఒక రోజు డిలే అయితే సినిమాను శుక్రవారం బదులుగా శనివారం విడుదల చేసే విషయాన్ని కూడా 'సాక్ష్యం' టీం పరిశీలిస్తోందని సమాచారం.  ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన 'సాక్ష్యం' సినిమా మొత్తం హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ తీసుకున్న విషయం తెలిసిందే.