Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డు రికార్డులే రికార్డులు

By:  Tupaki Desk   |   18 Aug 2017 9:57 AM GMT
సెన్సార్ బోర్డు రికార్డులే రికార్డులు
X
సీబీఎఫ్‌ సీ నుండి పంకజ్ నిహ్లానీ వెళ్లిపోయి.. ప్రసూన్ జోషి వచ్చాక.. సడన్ గా ఇండియన్ సెన్సార్ బోర్డు కూడా అమెరికన్ సెన్సార్ బోర్డు తరహాలో న్యూడిటీ.. బూతులు.. వగైరా వగైరా వెంటనే ఒప్పేసుకుని ధియేటర్లలోకి అలాంటి సినిమాలను దించుతుంది అనుకున్నారా? అంతే లేదు మాష్టారూ. అదిగో ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలాకాండి’ పరిస్థితి చూస్తే మీకు సీన్ అర్దమవుతుంది.

అక్షత్‌ వర్మ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో సైఫ్‌ ఎప్పుడూ చూడని ఓ కొత్త గెటప్‌ లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో ఏకంగా 73 సన్నివేశాలను తొలగించాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించడం ఇక్కడ హైలైట్. సినిమాలో మరీ ఎక్కువగా అసభ్య పదజాలం వాడారంటూ.. సెన్సార్ వారు సీరియస్ అయ్యారు కూడా. ఇంకో విషయం ఏంటంటే.. మొన్నామధ్యన నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించిన ‘బాబూమోషాయ్‌ బందూక్‌ బాజ్‌’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు 40 కత్తిరింపులు ఇస్తే.. అదే రికార్డు అనుకున్నాం. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు సైఫ్‌ సినిమాకు ఇచ్చిన కత్తెర్లు గిన్నీస్ రికార్డు అనాలేమో.

అదేంటో తెలియదు కాని.. ఒకప్పుడు సెన్సార్ లో ప్రాబ్లమ్ అవ్వకుండా మ్యానేజ్ చేస్తూ ఫిలిం మేకర్లు న్యూడిటి నుండి బూతులు వరకు అన్నీ చూపించేవారు. కాని ఇప్పటితరం మాత్రం.. అసలు సెన్సార్ బోర్డును తికమకపెట్టేస్తే నానా హంగామా చేస్తున్నారు. మరి కొత్త ప్రెసిడెంట్ వచ్చాక బోర్డు ఏ తరహాలో డెసిషన్లు తీసుకుంటుందో.. ఇప్పుడు సైఫ్‌ సినిమా ఏమవుతుందో చూడాలి.