Begin typing your search above and press return to search.

కంచె ట్రైలర్.. వాళ్ల మతి పోగొట్టింది

By:  Tupaki Desk   |   2 Sep 2015 6:56 AM GMT
కంచె ట్రైలర్.. వాళ్ల మతి పోగొట్టింది
X
నిన్న మధ్యాహ్నం నుంచి టాలీవుడ్ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. తెలుగులో ఇలాంటి సినిమానా అని ఒకటే చర్చ. ‘కంచె’ ట్రైలర్ మన సెలబ్రెటీలకు నిజంగానే మతి పోగొట్టింది. ట్విట్టర్ లో ఈ ట్రైలర్ పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. వాళ్లేమన్నారో చూడండి.

‘‘చాలా బాగుంది. ఈ సినిమా తీయడానికి ఎంత పరిశోధన, కష్టం అవసరమో అంచనా వేయగలను. కంచె టీంకి ఆల్ ద బెస్ట్’’
-రాజమౌళి

‘‘కంచె ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. మొత్తం టీంకి ఆల్ ద బెస్ట్’’
-మహేష్ బాబు

‘‘నా ఫ్రెండ్ క్రిష్, నా కజిన్ వరుణ్ తేజ్ కలిసి కొత్త తరం తెలుగు సినిమా అందిస్తున్నారు. ట్రైలర్ నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా’’
-అల్లు అర్జున్

‘‘ఒకే తరహా సినిమాల నుంచి బయటపడి తెలుగు సినిమా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ క్రిష్, హీరో వరుణ్ లకు కంగ్రాట్స్’’
-రామ్ గోపాల్ వర్మ

‘‘కంచె ట్రైలర్ నాకు భలే నచ్చింది. వరుణ్ తేజ్ స్టన్నింగ్, క్రిష్ కు కంగ్రాచులేషన్స్’’
-సాయిధరమ్ తేజ్

‘‘కంచె ట్రైలర్ చూసి పడిపోయా. క్రిష్ నుంచి మరో ల్యాండ్ మార్క్ ఫిలిం. నిన్ను చూసి గర్విస్తున్నా మచ్చా’’
-అల్లరి నరేష్

‘‘అక్టోబరు 2 వరకు ఆగలేకున్నా. వార్ అండ్ లవ్. పర్ఫెక్ట్ సెటప్’’
-మంచు లక్ష్మి

‘‘డైరెక్టర్ క్రిష్ తనదైన శైలిలో యునీక్ ట్రేడ్ మార్క్ సినిమాతో వస్తున్నాడు’’
-తాప్సి

‘‘మైండ్ బ్లోయింగ్ అంటే ఇదేనన్నమాట. క్రిష్.. నమ్మశక్యంగా లేదు. వరుణ్ తేజ్ టెర్రిఫిక్ గా ఉన్నాడు’’
-దేవిశ్రీ ప్రసాద్

‘‘హాలీవుడ్ రేంజిలో ఉంది కంచె ట్రైలర్. క్రిష్.. నువ్వు సాధించావ్. వరుణ్ తేజ్ టూ హాట్. అతణ్ని హ్యాండిల్ చేయడం కష్టం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా’’
-ఛార్మి

‘‘క్రిష్ సినిమా కంచె ట్రైలర్ చూశాక ఒకే ఒక్క మాట చెప్పగలను.. స్టన్నింగ్’’
-తరణ్ ఆదర్శ్, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్