Begin typing your search above and press return to search.

అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌ పై సెలబ్స్‌ ట్వీట్స్‌

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:11 AM GMT
అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌ పై సెలబ్స్‌ ట్వీట్స్‌
X
అఖిల్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సయేషా సైగల్‌ ఈ చిత్రంలో కథానాయిక. నితిన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పబ్లిసిటీలో స్పీడ్‌ పెంచారు. తాజాగా అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. ఈ పోస్టర్‌ అద్భుతం అంటూ ప్రశంసలొచ్చాయి. సెలబ్రిటీ ప్రపంచం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ లుక్‌ పై ఎవరెవరు ఎలా స్పందించారో ఓసారి పరిశీలిస్తే ...

ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సూపర్భ్‌. యాటిట్యూడ్‌, ఎనర్జీ పుష్కలంగా కనిపిస్తోంది అంటూ దేవాకట్టా ట్వీటాడు. మరో స్టార్‌ పుట్టుకొచ్చాడు. ఫస్ల్‌ లుక్‌ సూపర్భ్‌ అంటూ స్టార్‌ రైటర్‌ కోనవెంకట్‌ ప్రశంసించారు. అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌ కట్టి పడేస్తోంది. నితిన్‌ మరియు కొత్త కుర్రాడు అఖిల్‌ బ్లాక్డ్‌.. అంటూ పొగిడేశాడు రాజమౌళి.

ఆసమ్‌, కంగ్రాట్స్‌ అంటూ లక్ష్మీ ప్రసన్న పొగిడేశారు. ఈ బ్లాక్‌ లో అఖిల్‌ ని చూపించిన తీరు అద్భుతంగా ఉందంటూ బివిఎస్‌ రవి ప్రశంసించారు. అందరి నుంచి వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు చెప్పడంలో నితిన్‌, అఖిల్‌ బిజీగా ఉండి ఉంటారని నాగార్జున సంతోషాన్ని వ్యక్తం చేశారు.