Begin typing your search above and press return to search.

మ‌హేష్ కు బ‌ర్త్ డే విషెస్ వెల్లువ‌!

By:  Tupaki Desk   |   9 Aug 2018 11:14 AM GMT
మ‌హేష్ కు బ‌ర్త్ డే విషెస్ వెల్లువ‌!
X
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు నేడు 43వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దాంతో పాటు మ‌హేష్ అప్ క‌మింగ్ మూవీ `మ‌హ‌ర్షి` టైటిల్ - ఫ‌స్ట్ లుక్ - టీజ‌ర్ ల‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌డంతో మ‌హేష్ అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్ల‌యింది. ఈ రోజు నుండి నా జర్నీ 'రిషి'గా మొదలైందిస‌ అని మ‌హేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ మ‌హేష్ కు ప‌లువురు సినీ - రాజ‌కీయ ప్ర‌ముఖులు - అభిమానులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వాటికి బ‌దులుగా మ‌హేష్ మ‌రో ట్వీట్ చేశారు. మీ ప్రేమ మరియు దీవెనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ రోజు నుండి నా జర్నీ ‘రిషి'గా మొదలైంది అంటూ మహేష్ బాబు రిప్లై ఇచ్చారు. మ‌హేష్ బ‌ర్త్ డే ట్వీట్స్ లో కొన్ని...

కేటీఆర్: నాకు తెలిసిన అత్యంత విన‌య‌శీలి అయిన సూపర్‌ స్టార్ - ప్రియమైన స్నేహితుడు మహేశ్ కు జన్మదిన శుభాకాంక్షలు. భ‌విష్య‌త్తులో కూడా నీకు నువ్వే రాజుగా ఉండాలని ఆశిస్తున్నా.

ఎన్టీఆర్‌: హ్యాపీ బర్త్‌ డే మహేశ్‌ అన్నా.. మీకు ఈ ఏడాది విజ‌యవంతంగా ఉండాల‌ని - మీరు సుఖశాంతుల‌తో ఉండాలని కోరుకుంటున్నాను.

రకుల్‌ ప్రీత్‌: హ్యాపీ బర్త్‌ డే ఎవర్‌ గ్రీన్‌ వన్‌ అండ్‌ ఓన్లీ మహేశ్‌ బాబు. బ్లాక్‌ బస్టర్‌ సినిమాతో మీకు ఈ ఏడాది అద్భుతంగా ఉండాల‌ని ఆశిస్తున్నాను. మీకు ఆయురారోగ్యాలు - ఐశ్వర్యం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను.

కొర‌టాల శివ‌: నఆనాకు అత్యంత ఆప్త మిత్రుడు - సూప‌ర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్ల‌పుడూ సంతోషంగా ఉండాలి.

కోన వెంక‌ట్: మా ప్రిన్స్ - నిజ‌మైన సూప‌ర్ స్టార్ మ‌హేష్ కు హృద‌య‌పూర్వక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మ‌హేష్ ఏ క్యారెక్ట‌ర్ లోనైనా ఒదిగిపోగ‌ల‌డ‌ని ఈ లుక్ మ‌రోసారి నిరూపించింది. మ‌హ‌ర్షి టీం - వంశీ పైడిప‌ల్లికి అభినంద‌న‌లు.

గోపీచంద్‌ మలినేని: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘మహర్షి’ ఫస్ట్‌ లుక్‌ అదిరింది.

దేవిశ్రీ ప్రసాద్: అంద‌గాడు - నిగ‌ర్వి - శాంత‌మూర్తి - మాన‌వ‌తావాది అయిన ప్రియ‌మైన మ‌హేష్ కు సూప‌ర్ మ్యూజిక‌ల్ హ్యాపీ బ‌ర్త్ డే. మీరు ఎల్ల‌పుడూ విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్నా. మీ 25వ చిత్రంలో భాగ‌స్వామిన‌యినందుకు గ‌ర్విస్తున్నా. కీప్ రాకింగ్ ఆల్ వేజ్...ల‌వ్ యూ.

ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌ : మ‌హేష్ బాబు...త‌న 25వ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను త‌న పుట్టిన రోజునా రివీల్ చేశారు. టైటిల్ ...మ‌హ‌ర్షి....ద‌ర్శ‌కుడు...వంశీ పైడిప‌ల్లి

పూజా హెగ్డే: హ‌్యాపీ బ‌ర్త్ డే రిషి అకా మ‌హేష్. ఈ చిత్రం మీ కెరీర్ లో పెద్ద హిట్ అవుతుంది. గోవా పార్టీలో క‌లుద్దాం. అప్ప‌టివ‌ర‌కు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి.

మంచు మ‌నోజ్: మ‌నోజ్ అనే నేను...మ‌హేష్ అనే సూప‌ర్ స్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌ప‌రుస్తూ సెల‌వ తీసుకుంటున్నాను...జైహింద్. ఎల్ల‌పుడూ సంతోషంగా ఉండాల‌న్నా. ...గ‌డ్డం అదిరిపోయింది.

మోహన్‌లాల్‌: హ్యాపీ బర్త్‌డే సూపర్‌ స్టార్‌ మహేశ్‌

నాగబాబు: పుట్టినరోజు శుభాకాంక్షలు మహేశ్‌. ‘మహర్షి’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌

సుశాంత్‌: వావ్‌.. ఫస్ట్‌ లుక్‌ లో ఫ్రెష్‌ గా - ఛార్మింగ్‌ గా కనిపిస్తున్నారు. ఈ హ్యాండ్సమ్‌ స్టూడెంట్‌ కు హ్యాపీ బర్త్‌ డే

మారుతి: మన సూపర్‌ స్టార్‌ మహేశ్‌ కు పుట్టినరోజు శుభాకంక్షలు. ‘మహర్షి’ లుక్‌ అదిరింది.

అల్లరి నరేశ్‌: ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్‌. ‘మహర్షి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో మైలురాయి.

ఈషా రెబ్బా: టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో హ్యాండ్ సమ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబుకు హ్యాపీ బర్త్‌ డే.

అనిల్‌ రావిపూడి: అన్నా..ఫస్ట్‌ లుక్‌ అదిరింది. హ్యాపీ బర్త్‌ డే మహేశ్‌ గారు.