సెలబ్రిటీలు సూదిలో దారం ఎక్కిస్తున్నారు!

Sun Sep 23 2018 15:59:50 GMT+0530 (IST)

ఎప్పుడు కికి ఛాలెంజేనా..అని పెదవి విరిచే వారికోసం కొత్త ఛాలెంజ్ రెడీ అయింది.  ఈ ఛాలెంజ్ పేరు సూయి ధాగా ఛాలెంజ్.  దీనికోసం మీరు కదులుతున్న కారు దిగి 'కీకీ డూ యూ లవ్ మీ' అంటూ డ్రేక్ సాంగ్ కి డ్యాన్సు చేసి మళ్ళీ తిరిగి కారు ఎక్కాల్సిన పని లేదు. టైం బాగాలేకపోతే ఏ కరెంట్ స్థంభానికో కొట్టుకొని దభేల్ మని కింద పడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ సూది లోకి దారం ఎక్కించడమే.అసలు ఈ ఛాలెంజ్ ఎందుకు వచ్చిందంటే..  బాలీవుడ్ లో 'సూయిధాగా' అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ - అనుష్క శర్మ హీరో హీరోయిన్లు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఛాలెంజ్ ను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో అలియా భట్.. రణబీర్ కపూర్.. షారూఖ్ ఖాన్ లో పాల్గొన్నారు. మరి కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలను నామినేట్ చేశారు.   ఇక తాజా గా ఈ ఛాలెంజ్ ను సల్మాన్ ఖాన్ స్వీకరించి సూదిలో దారం ఎక్కించడమే కాకుండా SK(సల్మాన్ ఖాన్) అనే ఇనిషియల్స్ ను కూడా సూదితో కుట్టాడు. వరుణ్ ధావన్  సూయిధాగా ప్రమోషన్స్ కోసం ఈ సల్మాన్ నిర్వహించే బిగ్ బాస్ 12 కు రావడం తో అక్కడ ఇదంతా జరిగింది.

వీళ్ళు మాత్రమే కాదు.. ఆదిత్య రాయ్ కపూర్.. కరణ్ జోహార్.. జాన్వి కపూర్.. ఖుషి కపూర్ అందరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి సూదిలో దారం ఎక్కించారు. ఛాలెంజ్ ను విజయవంతంగా పూర్తి చేశారు........!

ఇక ఇంత కఠినమైన ఛాలెంజ్ గురించి మన బిత్తిరి సత్తెన్నకు తెలిస్తే తీన్మార్ మోగించడం ఖాయం. సావిత్రక్క "ఊకోరా సత్తి.. గిదొక ఛాలెంజ్ దాన్ని నువ్వు చేసుడు..గవన్నీ మనకెందుకురా" అనడం ఖాయం!