సెలబ్రిటీలకు తప్పిన అరెస్టు భయం!

Wed May 15 2019 12:35:24 GMT+0530 (IST)

డగ్స్ వ్యవహారంలో సినీ సెలబ్రిటీలకు చాలా రిలీఫే దొరికిందని అంటున్నారు పరిశీలకులు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ఎంత సంచలనం రేపిందో - తీరా చార్జిషీట్ దగ్గరకు వచ్చే సరికి అంత డల్ అయిపోయింది. చార్జిషీట్ దాఖలుకే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా సమయం తీసుకున్నారు. ఆ చార్జిషీట్లో విచారణను ఎదుర్కొన్న వారి పాత్ర గురించి ఎలాంటి అంశాన్నీ పేర్కొనలేదు.వారిని విచారించినట్టుగా మాత్రమే పేర్కొన్నారు కానీ వారు డ్రగ్స్ వాడారా - లేదా అనే అంశాన్ని కూడా చార్జిషీట్లో మెన్షన్ చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో సదరు సినీ సెలబ్రిటీలకు బిగ్ రిలీఫ్ లభించిందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే..ఒక దశలో  సదరు సినీ సెలబ్రిటీలు అరెస్టు కూడా అవుతారనే ప్రచారం జరిగింది. వారు డ్రగ్స్ వాడటమే కాకుండా - వారు డ్రగ్స్ ను ఇతరులకు సప్లై కూడా చేశారనే విశ్లేషణ వినిపించింది.

డ్రగ్స్ వాడితే బాధితులు అవుతారు. వారికి ఎవరు డ్రగ్స్ ఇచ్చారో వారు నిందితులు అవుతారు. ఈ లెక్కన కొందరు సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ వాడటమే కాకుండా - మరి కొందరికి అలవాటు చేశారని - వారికి రెగ్యులర్  గా సప్లై కూడా చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. కొందరి పేర్లు ఆ విషయంలో ప్రముఖంగా వినిపించాయి. వారు డ్రగ్స్ వాడటమే కాకుండా..ఇతరులకు సప్లై కూడా చేసినట్టుగా అప్పట్లో కథనాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు వాటికి విలువ లేకుండా పోయింది. సదరు సెలబ్రిటీలకు ఊరట లభించింది. ప్రత్యేకించి వారికి అరెస్టు భయం తప్పింది! ఈ కేసు నీరుగారి పోవడంతో వారికి గట్టి రిలీఫ్ లభించిందని వారి సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకించి ఒక దర్శకుడు - ఆయన సన్నిహిత హీరోయిన్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నట్టుగా  భోగట్టా!