Begin typing your search above and press return to search.

న్యూస్ ఛానల్ ఓనర్ గా హాట్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:15 AM GMT
న్యూస్ ఛానల్ ఓనర్ గా హాట్ ఎమ్మెల్యే
X
గతేడాది స్టైలిష్ స్టార్ తో కలిసి సరైనోడు మూవీలో నటించింది కేథరిన్ థ్రెసా. ఆ మూవీలో హాట్ ఎమ్మెల్యే పాత్రలో అల్లు అర్జున్ తో కలిసి.. ఈ భామ పండించిన రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే పదానికి బన్నీ నోటితో కొత్త అర్ధం చెప్పించుకున్న కేథరిన్.. మరో డిఫరెంట్ రోల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

దగ్గుబాటి రానా.. కాజల్ అగర్వాల్ లు జోడీగా తేజ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా.. పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కూడా ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తోంది. ఓ న్యూస్ ఛానల్ ఓనర్ గా ఈ సినిమాలో కనిపించనుందట కేథరిన్. రోల్స్ ఎంచుకోవడంలో అమ్మడు ఎంత చాకచక్యం ప్రదర్శిస్తుందనే విషయం.. ఈ పాత్రతో అర్ధమవుతుంది. ఎమ్మేల్యేగా రాజకీయాలు-రొమాన్స్ చేసిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ పై వస్తున్న మూవీలో.. న్యూస్ ఛానల్ ఓనర్ గా కనిపించనుంది.

ప్రస్తుతం ఛానల్స్ కు.. పాలిటిక్స్ కు ఏ రేంజ్ లో లింక్ ఉందో చూస్తూనే ఉన్నాం. అలాగే వాస్తవాలకు దగ్గరలో కేథరిన్ చేస్తున్న ఈ రోల్ ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో ఐటెం సాంగ్ ఛాన్స్ మిస్ అయిన బ్యూటీ.. 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో న్యూస్ ఛానల్ ఓనర్ పాత్ర ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటానని చెబుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/