Begin typing your search above and press return to search.

అడవి అందంగా కేథరిన్ పండించేస్తోంది

By:  Tupaki Desk   |   24 March 2017 4:52 AM GMT
అడవి అందంగా కేథరిన్ పండించేస్తోంది
X
కేథరిన్ థ్రెసా అందాలకు బోలెడంత డిమాండ్ ఉంది. దక్షిణాది మొత్తంలో ఈమెకు క్రేజ్ ఏర్పడ్డానికి అసలైన కారణం.. యాక్టింగ్ ట్యాలెంట్ తో పాటుగా అందాలను వైనంగా ప్రదర్శించే తెగువ ఉండడమే. అందుకే పలుసార్లు ఐటెం గాళ్ గా కూడా ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది.

తమిళ హీరో ఆర్య నటిస్తున్న కదంబన్ లో నటిస్తోంది కేథరిన్ థ్రెసా. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుండగా.. ఇప్పుడీ చిత్రానికి ప్రమోషనల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. కదంబన్ మూవీలో కేథరిన్ చేస్తున్న పాత్ర పేరు రాధీ. ఓ ట్రైబల్ గాళ్ గా కేథరిన్ ఈ మూవీలో కనిపించనుంది. అయితే.. వర్షపు నీటికి తడిసిన భారీ అందాలతో పాటు.. ఆర్యతో రొమాంటిక్ సన్నివేశాన్ని పండిస్తున్న ఓ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అడవి అందాలను తనలో ఇముడ్చుకున్న వనితగా కేథరిన్ సూపర్బ్ గా సెట్ కాగా.. ఆర్య ఆమె బుగ్గలను ముద్దాడడం.. నడుం చుట్టూ చెయ్యి వేసి.. చేతులతో నిమరడం.. ఈ ఫోటోలో కనిపిస్తుంది.

ఒక్క ఫోటోతోనే వేడి పుట్టిస్తుంటే.. ఇక పూర్తి సన్నివేశం ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆసక్తి కలగడంలో తప్పేమీ లేదు. రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్య టార్జాన్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా అందిస్తున్న సంగీతం.. ఈ మూవీకి మరో ఆకర్షణ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/